సాక్షి, విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రిఫరెండం అనడం చూస్తుంటే ఆయన వయసు మందగించిందని మరోసారి బయటపడిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లుకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ జాతీయ పార్టీ అధ్యక్షుడని చెప్పుకునే చంద్రబాబు రిఫరెండం అనే మాట ఏ విధంగా మాట్లాడతారని ధ్వజమెత్తారు. (చదవండి: ‘అమరావతి ఉద్యమం ఒక ఫేక్’)
భారతదేశంలో ఏ విషయంలోనూ ఇప్పటి వరకు రిఫరెండం అనలేదన్నారు. గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు నాయుడు రిఫరెండం కోరారా అని సూటిగా ప్రశ్నించారు. పనికి రాని వ్యక్తుల మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లు ఉండాలని, కనీసం ఒక రాష్ట్రంలోనే సరైన సీట్లు లేని మీరు జాతీయ పార్టీ అని ఏవిధంగా చెబుతారన్నారు. దానికి మరల 500 మంది కమిటీ ఏమిటన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టలేదన్న చంద్రబాబు హైకోర్టులో గ్యాగ్ అర్డర్ ఎందుకు తీసుకున్నారన్నారు. ఎలుకలను పట్టారా, పందికొక్కులను పట్టారో త్వరలోనే తెలుస్తుందని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.(చదవండి: టీడీపీ నేత బెదిరింపులు తాళలేక..)
Comments
Please login to add a commentAdd a comment