
సాక్షి, ఆదిలాబాద్: ‘స్థానిక’ఎమ్మెల్సీ నామినేషన్ల ఉప సంహరణకు చివరిరోజైన శుక్రవారం ఆదిలా బాద్‌లో వివాదాలు తలెత్తాయి. తమ అభ్యర్థి దండె విఠల్‌ను ఏకగ్రీవం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ నేత లు చివరివరకు ప్రయత్నించారు. నామినేషన్లు ఉప సంహరించుకోవాలంటూ స్వతంత్ర అభ్యర్థులపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అందరూ విత్‌డ్రా చేసుకున్నా.. స్వతంత్ర అభ్యర్థి, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పరాణి పోటీలో నిలిచారు.
అంతకుముందు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ ఉపసంహరించేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద పుష్పరాణి ధర్నా చేశారు. ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు, బీజేపీ శ్రేణులు ఆమెకు మద్దతు రావడం.. మరోవైపు పోటీగా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీ సులు అప్రమత్తమై.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే పుష్పరాణి పోటీలో ఉన్నట్టు రిటర్నింగ్ అధి కారి ప్రకటించాక.. ఈ వివాదం సద్దుమణిగింది.
(చదవండి: దేవుడిలా ఆదుకున్న పోలీస్.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రశంసలు)
మరో అభ్యర్థి ఆందోళన
మరోవైపు జాబితాలో తన పేరు లేకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్ నేతలు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్‌ను ఉప సంహరించారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశానని, కోర్టును కూడా ఆశ్రయిస్తానని తెలిపారు.
(చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment