సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ.. బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎక్స్‌వేదికగా సెటైర్లు వేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా.. వీటిపైనే కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు వస్తున్నారు. మరి.. ఈ మూడు విభజన హక్కులకు దిక్కేది? అంటూ నేరుగా ప్రధానికే ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పదేళ్ల నుచి పాతరేసి.. ఎంత కాలం ఈ అబద్ధాల జాతర?.. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు? అంటూ మోదీని ప్రశ్నించారు.
నేడు నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ప్రధాని @narendramodi గారు...
— KTR (@KTRBRS) October 3, 2023
మా మూడు ప్రధాన హామీల సంగతేంటి...???
1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ?
2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ?
3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ?
మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నరు…..మరి.. ఆ…
Comments
Please login to add a commentAdd a comment