TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే | Names Of Telangana Lok Sabha Congress Candidates Under Consideration | Sakshi
Sakshi News home page

TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే

Published Thu, Mar 7 2024 9:11 AM | Last Updated on Thu, Mar 7 2024 11:17 AM

Names Of Telangana Lok Sabha Congress Candidates Under Consideration - Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం నేడు సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు.

తెలంగాణ, కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ జాబితాను తెలంగాణ పీసీసీ.. సీఈసీకి పంపించింది.

సీఈసీ పరిశీలనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 
1. మహబూబ్‌గర్: వంశీచంద్ రెడ్డి 
2. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
3.  నిజామాబాద్ : జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. జహీరాబాద్ : సురేష్ శెట్కార్
6.  సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్
7. నల్గొండ : జానారెడ్డి 
8. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి 
9. మహబూబాబాద్ :  బలరాం నాయక్
10.వరంగల్ : అద్దంకి దయాకర్ /సర్వే సత్యనారాయణ 
11. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
12. హైదరాబాద్:  ఫిరోజ్ ఖాన్
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్ 
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్ 
15. మెదక్ : నీలం మధు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement