
గిరిజనులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు అని.. మధ్యప్రదేశ్ దుస్థితికి ఆ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఝబువా(మధ్యప్రదేశ్): గిరిజనులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు అని.. మధ్యప్రదేశ్ దుస్థితికి ఆ పార్టీయే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఝబువా జిల్లాలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడమే కాదు.. వారిని అవమానపరిచిందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు వస్తాయని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూటమి కనుమరుగవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?