సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు కేసీఆర్ అవినీతిపై మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు ఢిల్లీలో సీఎం పర్యటనలో దాగున్న రహస్యం ఎంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ పరస్పరం తిట్టుకొని ఇప్పుడు రహస్య మంతనాలు ప్రజలు గమనించాలన్నారు. రైతులకు మద్దతుగా డిసెంబర్ 8న భారత్ బంద్‌లో టీఆర్‌ఎస్ కూడా పాల్గొందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులను పిలుచుకొని కేసీఆర్ ఢిల్లీ రైతులకు మద్దతుగా కలిసి దీక్షల శిబిరంలో పాల్గొనాలని సూచించారు. కేసీఆర్ కేంద్ర మంత్రులను కలిసినప్పుడు తమ ఎంపీలు, శాఖ అధికారులు ఎందుకు లేరని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. చదవండి: అవినీతిలో ఆమెకు ఆమే సాటి
‘గత 15 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఎముకలు కొరికే చలిలో రైతులు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ అమిత్‌షాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కేసీఆర్, అమిత్‌షా, మోదీ ,ఒవైసీ అంత ఒకటే. ఢిల్లీ పై పోరాటం చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ బీజేపీ నేతలను కలుస్తున్నారు. దేశంలో ఏ పార్టీ పైన అయిన సీబీఐ ,ఈడీ కేసులు చేస్తున్న బీజేపీ కేసీఆర్‌పై ఈగ కూడా వాలనివ్వడం లేదు. కేసీఆర్ అవినీతిపైన ఎందుకు విచారణ జరిపిస్తలేరు. వరదసాయం ఆడిగేతే దాని అంచనా ఏది.. అధికారులను ఎందుకు తీసుకుపోలేదు. మీరు వేయమంటేనే సన్న వడ్లు రైతులు వేశారు. అక్కడే ఉన్న ఢిల్లీ నేతలను సన్న వడ్లకు మద్దతు ధర కల్పించాలని అడగండి. బీజేపీ బెదిరింపులకు భయపడే ఢిల్లీ వెళ్లావు. తెలంగాణ ప్రయోజనాల కోసం అని కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీ పోరాటానికి అండగా ఉంటుంది. కానీ ఓ రహస్య ఎజెండా తో రాజకీయ లబ్ది కోసమే ఢిల్లీ వెళ్లారు.’ అని కేసీఆర్‌ను నిలదీశారు. చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్
Comments
Please login to add a commentAdd a comment