న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లడంపై ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లను కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ మొత్తాన్ని 62 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేయడానికి ఉపయోగించవచ్చని, అలాగే వైద్యారోగ్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల బలోపేతం చేయవచ్చని హితవు పలికారు.
ఈ నిధులతో అనేక వసతులు ఏర్పాటు చేయవచ్చంటూ ఆ జాబితాను ప్రియాంక గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని నివాసం, సెంట్రల్ విస్టా నిర్మాణానికి కేటాయించిన కోట్ల రూపాయలతో ఏమి చేయవచ్చో ట్విటర్ వేదికగా సూచించారు.
చదవండి: ‘ఇది రాజ్యాంగ విధి.. షెడ్యూల్ ప్రకారమే పర్యటిస్తా’
PM’s new residence & Central vista cost
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2021
= Rs 20,000 cr
= 62 crore vaccine doses
= 22 crore Remdesvir vials
= 3 crore 10 litre oxygen cylinders
= 13 AIIMS with a total of 12,000 beds
WHY?
Comments
Please login to add a commentAdd a comment