బీజేపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తా: ఎంపీ అర్వింద్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ కొన్ని కార్యక్రమాలు చురుగ్గా చేశారని, ఆయనకు మరో 15 ఏళ్ల వరకు రాజకీయాల్లో మంచి అవకాశాలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే ఆయన మరింత నష్టపో తారని స్పష్టం చేశారు. ఆయన బీజేపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తానన్నారు. రేవంత్ అసమర్థుడు కారని, కాంగ్రెస్‌లో ఉంటే మాత్రం అసమ ర్థునిగా మిగిలిపోతా రన్నా రు.
మోదీ ప్రభుత్వంలో పసుపు రైతులకు మార్కె ట్ పెరిగిందని, ప్రధాని మోదీ పై ప్రేమతోనే పసుపు రైతులు ఈసారి బీజేపీకి ఓటు వేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పేర్కొన్నారని విమర్శించారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేస్తే జైల్లో వేయాలని, రోజూ అదే అంశంపై మాట్లాడటం అనవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment