రాష్ట్రంలో పేట్రేగిపోతున్న నేరస్తులు, ఉన్మాదులు
120 రోజుల్లో 74 మందికిపైగా ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలు
గుడి, బడి తేడాలేకుండా బెల్టు షాపులు
ఆడపిల్లల తల్లులు ఆర్తనాదాలు పెడుతుంటే రియాల్టీ షోలో సీఎం నవ్వులాట
నాడు ఊగిపోయిన పవన్‌కళ్యాణ్ నేడు ఏమయ్యారు?
వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కేరోజా ధ్వజం
నగరి: రాష్ట్రంలో నేరస్థులు, ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కేరోజా ధ్వజమెత్తారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని తన స్వగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లల తండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. కూటమి నేతల అండతో కాలకేయులు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నివాసమున్న చోటే టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని అనుచరుడు నవీన్ ఒక అమ్మాయిపై దాడిచేస్తే ఆమె బ్రెయిన్ డెడ్ అయి ఆస్పత్రిలో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌గానీ, హోమ్ మంత్రి అనిత గానీ, స్థానిక ఎమ్మెల్యేగానీ పరామర్శించలేదన్నారు.
సత్వర వైద్యసేవలు సైతం అందించే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ ఇచ్చే పని పక్కన బెట్టి అధికార పార్టీ నాయకులు చెప్పే వారిపై కేసులు ఎలా బనాయించాలి, ఎలా అరెస్టు చేయాలి అనే ఆలోచిస్తున్నారని విమర్శించారు. 120 రోజుల్లో 74కు పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే.. సమాధానం చెప్పాల్సిన హోమ్ మంత్రి నేను గన్ ఎత్తుకు తిరగాలా, లాఠీ ఎత్తుకు తిరగాలా అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు.
బద్వేలులో నిన్న అమ్మాయి చనిపోయిందని, 10వ తరగతిలో టాపర్ అయిన దస్తగిరమ్మను విఘ్నేష్ అనే వ్యక్తి తీసుకెళ్లి తన కోరిక తీర్చుకుని కాల్చి చంపేస్తే.. బావమరిది బాలకృష్ణ నడిపే అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న వీరికి.. ఆడపిల్లలపై ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా మహిళా పోలీస్ స్టేషన్లను, దిశా చట్టాన్ని, యాప్‌ను పునరుద్ధరించాలని రోజా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment