
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదువుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, సీఎం జగన్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు.
‘‘చంద్రబాబు ఏజెంట్‌గా పవన్ మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. పవన్ ఆలోచన అంతా చంద్రబాబు గురించే. తన హయాంలో ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా?. మాచర్లలో చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బయటపడింది. మాచర్లను అగ్నిగుండంగా తయారు చేయాలని చంద్రబాబు యత్నించారు’’ అని సజ్జల మండిపడ్డారు. మూడున్నరేళ్లలో 62 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశామని, కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు 26 వేల కోట్ల లబ్ధి చేకూరిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: Fact Check: అబద్ధాలు చెప్పటమే అసలు దగా! దిగజారిపోయిన ‘ఈనాడు’
Comments
Please login to add a commentAdd a comment