
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తీరుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. సోమవారం సజ్జల ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ చంద్రబాబు గారూ, ఇంకా ఎందుకు అబద్దాలు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు? పంచాయతీల్లో మాపార్టీ మద్దతుదారులు ఎక్కడెక్కడ గెలిచారో ఫొటోలతో సహా జాబితాలను http://ysrcppolls.in వెబ్‌సైట్లో పెట్టి విడుదలచేశాం. మీ వాళ్లు ఎక్కడ గెలిచారో ఫొటోలతో సహా జాబితాలు విడుదలచేయగలరా?’’ అని సవాల్ విసిరారు. ( నీకు కుప్పంలోనే దిక్కు లేదు: మంత్రి అనిల్)
అంతకు క్రితం.. ‘‘ రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును.. ప్రజలే ఇప్పుడు తిరగరాశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయతీ, నిబద్దతతో హామీలను నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ గారే మాకు మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలనే రీతిలో తీర్పు చెప్పారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment