
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్య పర్యటనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లిన లోకేష్.. అక్కడి నుంచి ఎక్కడి వెళ్లారో సస్పెన్స్ నెలకొంది. రెండు వారాల్లోనే రెండోసారి మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కాగా, నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్న లోకేష్.. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చిది.
ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment