
సాక్షి, కాకినాడ: ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం పేరిట వైఎస్సారీసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎత్తగడ వేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పర్యటించిన చంద్రబాబుకి చుక్కెదురైంది. శుక్రవారం రాత్రి తాళ్లరేపు మండలంలో కార్యక్రమానంతరం రామచంద్రపురం మండలం చోడవరం చేరుకోగానే అక్కడి గ్రామస్తులు నిరసన వ్యక్తంచేశారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులతో చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ‘నిన్ను నమ్మం బాబూ’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అన్నవరం విచ్చేసిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం స్థానిక వన్ రిసార్ట్స్‌లో జరిగిన తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీని గద్దె దించడానికి ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment