Telangana BJP Chief Bandi Sanjay Slams On CM KCR Over Resignation Of BJP state president Forgery letter - Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్‌ రాజీనామా చేసినట్టు ఫోర్జరీ లేఖ వైరల్‌.. స్పందించిన బండి

Published Wed, Nov 2 2022 2:44 AM | Last Updated on Wed, Nov 2 2022 9:26 AM

Telangana BJP Chief Bandi Sanjay Slams On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దొంగ పాస్‌పోర్టులు తయారుచేసిన వాడికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫోర్జరీ లేఖ వైరల్‌ కావడంపై మంగళవారం రాత్రి ఆయన స్పందించారు.

ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని తెలిసి ఇట్లాంటి ఫేక్‌ లెటర్లనే కేసీఆర్‌ సృష్టించారు. అయినా కూడా ప్రజలు బీజేపీని గెలిపించారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌ ఫేక్‌ లెటర్‌ సృష్టించాడంటే మునుగోడులో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని స్పష్టమవుతోంది’.. అని అందులో పేర్కొన్నారు. ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై రేపు ఈసీతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement