సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేస్తారో చెప్పాలని ఐదుగురు మాజీ ఎంపీలను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రశ్నించారు. మాజీ ఎంపీ హోదా, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టు, పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శక్తి మేరకు పనిచేయాలని సూచించారు. ఆదివారం మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్‌లు గాంధీభవన్‌లో ఠాక్రేను కలి శారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని పార్టీ పరి స్థితులు, ఇతర రాజకీయ పార్టీల బలాలు, బలనతలు, బీజేపీ వైఖరి, బీఆర్‌ఎస్ ఏర్పాటు వల్ల మారే రాజకీయాలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఠాక్రే సూచించారు. ఫిబ్రవరి ఆరు నుంచి జరగనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలో వీలైనన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాల న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, మార్గనిర్దేశం చేసే నాయకులు ఏకమైతే అధికారంలోకి రావడం కష్టమేమీ కాదని మాజీ ఎంపీలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలోని పార్టీ నేతలందరినీ ఏకం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment