manikrao thackeray
-
ఇంకా కొలిక్కిరాని తెలంగాణ సీఎం ఎంపిక
-
నేడు కాంగ్రెస్ మలి జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మలి జాబితాపై కసరత్తు దాదాపు పూర్తయింది. నేతల చేరికలు, మార్పుచేర్పుల నేపథ్యంలో విడుదల జాప్యమవుతోందని, శుక్రవారం రాత్రికల్లా మలి జాబితాను ఏఐసీసీ విడుదల చేయనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కమ్యూనిస్టులకు కేటాయించే నాలుగు స్థానాల పేర్లు ఉండనున్నాయని తెలిపాయి. ఇందులో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులకే సీట్లు కేటాయించేలా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసిందని పేర్కొన్నాయి. అసంతృప్తిని చల్లార్చేందుకు..: కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాక కొన్నిచోట్ల అసంతృప్తి బయటపడిన నేపథ్యంలో.. మలి జాబితా తర్వాత అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇద్ద రు, ముగ్గురికిపైగా టికెట్లు ఆశిస్తున్న సుమారు 17 నియోజకవర్గాలకు సంబంధించి.. నేతలను ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నారు. అవసరమైన వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బుజ్జగిస్తు న్నారు. ఈ క్రమంలో మలి జాబితాపై ఆశావహు లు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కా గా.. శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికను సీఈసీ ఖరారు చేయనుంది. కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి రాజగోపాల్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్‌లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అంతకుముందు రాజగోపాల్‌రెడ్డి, మిగతా ఇద్దరు నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర పెద్దలను కలసి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీ చేరాలని వారు భావించారు. కానీ శుక్రవారం ఉదయం కాంగ్రెస్ సీఈసీ భేటీ ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే పార్టీలో చేరితే అభ్యర్ధిత్వాలను పరిశీలించడం సాధ్యమవుతుందని పెద్దలు స్పష్టం చేశారు. దీంతో ఈ ముగ్గురి చేరికల తతంగాన్ని గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ముగ్గురు నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవనున్నారు. -
గ్యారంటీ కార్డుతో ప్రజల్లోకి వెళతాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలతో గ్యారెంటీ కార్డును రూపొందిస్తామని.. ఆ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయడం ద్వారా అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజల్లో కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. సెప్టెంబర్ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలన్న ప్రతిపాదన ఉందని.. ఒకట్రెండు రోజులు అటూఇటూగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. సోమవారం గాం«దీభవన్‌లో రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఫహీంలతో కలసి ఠాక్రే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీపరంగా అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నామని, తాము అధికారంలోకి వస్తామని వాటిలో స్పష్టంగా వెల్లడవుతోందని చెప్పారు. రోజురోజుకూ బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ గ్రాఫ్ మరింత దిగజారుతుందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో ఒక కారు తిరుగుతోంది. ఆ కారులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితలతోపాటు బీజేపీ కూడా కలసి ప్రయాణం చేస్తోంది..’’ అని ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను ప్రకటిస్తామన్నారు. ‘లెఫ్ట్’కు తలుపులు మూయలేదు లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశంపై ఠాక్రే మాట్లాడారు. ‘‘లెఫ్ట్ పార్టీలతో మేం మాట్లాడాం. వారు మాతో మాట్లాడారు. కానీ ఇదంతా అనధికారికమే. అధికారికంగా ఇంకా చర్చలు ప్రారంభం కాలేదు. లెఫ్ట్ పార్టీలకు మా తలుపులు మూసి ఉంచలేం. ఎందుకంటే వారు ఆర్ఎస్ఎస్, బీజేపీ కాదు. ఇండియా కూటమిలో భాగస్వాములు. అయినా వారితో చర్చలు జరపాల్సింది నేను కాదు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత వారితో చర్చిస్తారు. అప్పుడే చర్చలు అధికారికంగా ప్రారంభమైనట్టు లెక్క. అప్పటివరకు వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే..’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విషయం గురించి రాష్ట్రస్థాయిలోని తమకు అవగాహన లేదన్నారు. వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. -
కమ్మలకు ప్రాధాన్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యమివ్వాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం గాందీభవన్‌లో కమ్మ ఐక్య వేదిక ప్రతినిధులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను కలసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ లోని కమ్మ నేతలకు తగిన అవకాశాలు కల్పించాలని అందులో కోరారు. పరిశీలకుల భేటీ.. ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ పరిశీలకుల సమావేశం ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పరిశీలకులు దీపాదాస్మున్షీ, జ్యోతిమణి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటరీ స్థానాల వారీగా తమ పర్యటనల సందర్భంగా దృష్టికి వచ్చిన అంశాలను, ఆయా స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఈ సందర్భంగా పరిశీలకులు ఠాక్రేకు వివరించారు. ఈ మేరకు పార్లమెంటు స్థానాల వారీగా ప్రత్యేక నివేదికను తయారుచేసి అధిష్టానానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డిక్లరేషన్లు.. బస్సు యాత్ర.. సభలు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తోంది. వివిధ వర్గాల వారీగా హామీలతో డిక్లరేషన్ల ప్రకటన.. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ నేతల్లో ఐక్యతను చాటడం.. సభలు, సమావేశాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన గాందీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలను, బీజేపీ–బీఆర్ఎస్ మధ్య స్నేహాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతోపాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఎలా లబ్ధి చేకూరుస్తుందన్న దానిపై విస్తృత ప్రచారం కల్పించాలని తీర్మానించారు. దీనిపై ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాలని, కర్ణాటక తరహాలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటనలను ఖండిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలన్న డిమాండ్‌తో తీర్మానం చేశారు. ఆగస్టు 15 నుంచి బస్సు యాత్ర! ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. వీలున్నంత త్వరగా బస్సు యాత్ర చేపట్టాలని, ఆగస్టు 15 నుంచి మొదలుపెడితే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. మరికొందరు నేతలూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీనితో బస్సు యాత్రను ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎవరెవరి ఆధ్వర్యంలో చేపట్టాలన్న దానిపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. సబ్ కమిటీ గతంలో జరిగిన బస్సుయాత్రలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలు, సూచనలు చేయాలని.. ఆ తర్వాత రూట్‌మ్యాప్ ఖరారు చేద్దామని తీర్మానించారు. డిక్లరేషన్లపైనా సబ్ కమిటీ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల కోసం డిక్లరేషన్లను ప్రకటించేందుకు నిపుణులు, మేధావులు, పార్టీ నేతలతో ఓ కమిటీ వేయాలని కాంగ్రెస్ పీఏసీ నిర్ణయించింది. రెండు రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఆయా వర్గాల కోసం ఏం చేస్తామన్న దానిపై ఈ కమిటీ సూచనలు చేయాలని నిర్ణయించారు. ప్రియాంకా గాందీతో సభ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఈ నెల 30న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. ఆ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ అనుమతి కూడా లభించినందున సభ ఏర్పాట్లపైనా చర్చించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల గర్జన పేరుతో ఆగస్టు 15న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని.. ఆ వేదికపైనే ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందన్న డిక్లరేషన్లు ప్రకటించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, జానారెడ్డి, రేణుకాచౌదరి, సంపత్‌కుమార్, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, బలరాం నాయక్, చిన్నారెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తదితరులు పాల్గొన్నారు. 85 చోట్ల బలంగా.. ఎక్కడెక్కడ ఎలా? పీఏసీ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ‘మిషన్–2023’ పేరుతో సుదీర్ఘంగా ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల అనివార్య బలహీనతలు పార్టీని వెంటాడుతున్నాయని స్పష్టం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన పార్టీ పరిస్థితిని వివరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 12 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 85 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందని.. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో చాలాచోట్ల కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా పార్టీ లేదని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గాలకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పలు అంశాలను ఆయన సూచించగా.. వాటిపై ప్రచార కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని పీఏసీ భేటీ నిర్ణయించింది. ఇక భేటీలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నేతలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, పార్టీ నేతలతో మర్యాదగా నడుచుకోవాల్సిన కొందరు కనీసం తమ ఫోన్లు ఎత్తడం లేదని పేర్కొన్నట్టు తెలిసింది. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. పార్టీ పక్షాన ప్రజలకు హామీలివ్వడంతోపాటు గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న 100రోజుల పాటు పార్టీ కేడర్ పూర్తిగా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇచ్చేలా ప్లాన్ చేయాలని సూచించినట్టు తెలిసింది. వీరితోపాటు ఇతర నేతలు ప్రస్తావించిన పలు అంశాలపైనా పీఏసీ సమావేశంలో చర్చించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతాం: మధుయాష్కీ, షబ్బీర్‌అలీ పీఏసీ సమావేశం అనంతరం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. చేయూత పేరుతో తాము ప్రకటించిన రూ.4వేల పింఛన్ హామీ ఇప్పుడే ప్రభావం చూపిస్తోందని.. తమ హామీని చూసి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు రూ.4,016 పింఛన్‌ను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. ఇక షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నేతల చేరికలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, వాటిపై పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని చెప్పారు. -
పొన్నంకే ఎందుకు అన్యాయం?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కమిటీలోనూ స్థానం కల్పించకుండా అవమానపరుస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆదివారం గాందీభవన్‌లో ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యూఐ నుంచి పార్టీ కి సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రభాకర్‌కే ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. పదవులు రాకుండా జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు, రాష్ట్ర స్థాయిలో మరికొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఏఐసీసీ నియమించిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ)లో పొన్నంకు స్థానం కల్పించనందుకు నిరసనగా గాంధీభవన్‌కు వచ్చిన ఆయన అనుచరులు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన నేతలను కూడా అడ్డుకునే యత్నం చేశారు. అవసరమైతే తన పదవి ఇస్తానన్న కోమటిరెడ్డి సరిగ్గా అదే సమయంలో గాందీభవన్‌కు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారితో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైతే తన స్థానంలో పొన్నం పేరు చేర్చాలని పార్టీని కోరు తానని చెప్పారు. సీనియర్ నేత జానారెడ్డి స్పంది స్తూ పార్టీ వదిలి వెళ్లిపోయిన మహేశ్వర్‌రెడ్డి స్థానంలో పొన్నంకు అవకాశం కల్పించాలని సూచించారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే పొన్నంకు చైర్మన్ పదవి వస్తుందన్నారు. పీఏసీ సభ్యులు ఎక్కువయ్యారు.. అందుకే: ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ పొన్నం విషయంలో ఆందోళన అవసరం లేదని, త్వరలోనే ఆయనకు మంచి హోదా కల్పిస్తామని, పీఏసీ సభ్యులు ఎక్కువ కావడంతోనే ఆయనకు అవకాశం కల్పించలేకపోయామన్నారు. -
గాంధీ భవన్లో కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ గెలుపు కోసం నేతలు వ్యూహ రచనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కర్ణాటకలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. అదే జోరు, జోష్‌ను తెలంగాణలో చూపించి ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని హస్తం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌లో పీఏసీ సమావేశమైంది. మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రియాంక సభ, బస్సు యాత్ర, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన -
ముందే ప్రకటిస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు!
ముందే ప్రకటిస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు! -
సోనియానే విస్మరిస్తారా?
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్‌రావ్ ఠాక్రే విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చేరుకుంది. అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఠాక్రే మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రతో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినట్టే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కేసీఆర్ సర్కారును గద్దె దించుతుందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, తెలంగాణలోనూ అమలు పరుస్తామని వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల బతుకులు మారాలని సోనియా తెలంగాణ ఇస్తే, కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా వారి జీవితాల్లో మార్పు రాలేదని ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రా నుందని తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెరుతుంగై అన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, సిరివెళ్ల ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ పాల్గొన్నారు. -
ప్రతి నెలా పీఏసీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ప్రతి నెలా మొదటి వారంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత అంశాలు పీఏసీలో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయాలు అమలు చేయాలని తీర్మానించారు. శుక్రవారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావెద్, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పీఏసీ ఉన్నట్టా లేనట్టా? రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్‌రావ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తర్వాత పీఏసీ సమావేశాలు నిర్వహించకపోవడంపై చర్చ జరిగింది. తొలినాళ్లలో ఒకసారి మాత్రమే నిర్వహించారని, ఆ తర్వాత ఎలాంటి సమావేశం జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. ‘వచ్చే నెల రెండో తేదీన జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి న సోనియాగాం«దీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చిత్రపటాలకు పాలాభి షేకం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం రోజుకో కార్యక్రమం చొప్పున 20 రోజుల పాటు ‘దశాబ్ది దగా’పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అదే విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలి..’ అని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నన్ని రోజులు పార్టీ శ్రేణులు తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాలు ఎగురవేయాలని సమావేశం పిలుపు నిచ్చి ంది. ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారు: మధుయాష్కీ గతంలో ఆంధ్ర వాళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వారికే దోచిపెడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. ముఖ్య నేతల భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్, సంపత్‌కుమార్, నదీమ్ జావెద్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన ఏర్పాటు చేస్తామని, ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ఆహా్వనిస్తామని చెప్పారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా బహిష్కరించనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హిమాచల్ సీఎం సుఖుపై బీఆర్ఎస్ నేతల విమర్శలను వారి విచక్షణకే వదిలివేస్తున్నామని శ్రీధర్‌బాబు అన్నారు. -
బరాబర్ ధరణిని రద్దు చేస్తాం
సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల రూరల్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ను బరాబర్ రద్దుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్‌లో భూసమస్యలు ఎదుర్కొంటున్న గ్రామస్తులతో మీభూమి– మీహక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ‘ధరణి అదాలత్’గ్రామసభను నిర్వహించింది. ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదుకాక, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను కాంగ్రెస్ నేతలు తెలుసుకున్నారు. తర్వాత వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గ్యారంటీ కార్డులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కొప్పుల రాజు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. భూస్వాములు, కేసీఆర్ కుటుంబీకుల కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. అందువల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు పంచిన 22 లక్షల ఎకరాల భూమి భూస్వాముల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. సీసీఎల్ఏ చేతిలో ధరణి పోర్టల్ లేదని.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి, వెనక నుంచి కేసీఆర్ కుటుంబీకులు వేలకోట్లు కాజేస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో ‘ధరణి అదాలత్’ ధరణి పేరుతో కేసీఆర్ సర్కారు పేదల భూములను కబళిస్తోందని.. పేదలకు తిరిగి భూహక్కులు కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఏఐసీ సీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దివంగత సీ ఎం వైఎస్సార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పేదలకు భూయాజ మాన్య హక్కులు కల్పించారని.. బీఆర్ఎస్ సర్కారు ఆ భూములను లాక్కుంటోందని జాతీయ నేత కొప్పుల రాజు ఆరోపించారు. కాంగ్రెస్ పంచ సూత్రాలివీ.. ♦ ధరణి పోర్టల్‌లో 60 లక్షల మంది పేర్లు ఉంటే.. అందులో దాదాపు 20 లక్షల ఖాతాల్లో పేరు, స ర్వే నంబర్‌తోపాటు చాలా తప్పులున్నాయి. అ న్నీ దిద్ది ఎవరి భూమిపై వారికి హక్కులివ్వాలి. ♦ మేమొచ్చాక రెండేళ్లలో భూముల రీసర్వే. ♦ రాష్ట్రంలోని 125 భూచట్టాలు, 3 వేల జీవోలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకే చట్టంగా తీసుకొస్తాం ♦ బలవంతపు భూసేకరణ పూర్తిగా నిషేధిస్తాం. భూయజమాని అనుమతి లేకుండా సేకరించవద్దంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచి్చన చట్టాన్ని కచి్చతంగా అమలు చేస్తాం. ♦ తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులకు పథకాలు అందిస్తాం. కవితను బహిష్కరించలేదేం: రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడితే కొడుకైనా, బిడ్డ అయినా జైలులో పెడతానని కొన్నిరోజుల కింద సీఎం కేసీఆర్ చెప్పారని, మరి మద్యం కుంభకోణానికి పా ల్పడిన ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు వస్తేనే పద వి నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. ఇద్దరూ ఆడపిల్లలే..పట్టా పాస్‌బుక్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూమిని కేటాయించి లావణి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ధర ణి తెచ్చాక భూమిని ఆ న్లైన్లో నమోదు చేయకపోవడంతో పట్టా దారు పాస్‌బుక్ ఇవ్వలేదు. నాకు ఇద్దరు ఆడ పిల్లలే. పనిచేస్తేనే పూటగడిచేది. సర్కార్ ఇప్పటికైనా పాస్‌బుక్ ఇవ్వాలి. – కవ్వంపల్లి జ్యోతి -
రాహుల్‌గాంధీ చెప్పిందే నేనూ చెప్పా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పొత్తు కామెంట్లు.. తెలంగాణలో పోలిటికల్ హీట్ రాజేయగా.. ఆ ఎపిసోడ్ వెనువెంటనే అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. కోమటిరెడ్డి చేసిన పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలోని చోటా మోటా నేతలు సైతం కోమటిరెడ్డిపై మండిపడుతున్నారు. ఈ తరుణంలో.. రేపు(బుధవారం) ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే నుంచి పిలుపు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. ఈ లోపే వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రమే ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు. తెలంగాణలో హంగ్ వస్తుందని నేను అనలేదు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని కూడా నేను అనలేదు. నా వ్యాఖ్యలు అర్థం అయ్యే వాళ్లకు అర్థం అవుతాయి. మాకు ఎవరితో పొత్తు ఉండదు. రాహుల్ గాంధీ చెప్పిందే నేను చెప్పా. కాంగ్రెస్‌కు ఎవరితో పొత్తు ఉండదని. ఇవాళ చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు. బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి. అనూహ్యం.. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం కంటే ముందుగానే ఈ భేటీ జరగడం గమనార్హం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో వీళ్ల భేటీ జరిగనట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి తో పాటు ఏఐసీసీ కార్యదర్సులు నదీమ్ జావీద్ , బోసురాజు , హర్కర్ వేణుగోపాల్ కూడా హాజరు కాగా.. 20 నిమిషాలుగా పైగా భేటీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో చూడలేదు ఇక ఈ పరిణామంపై అంతకు ముందు మీడియాతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే స్పందించారు. వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. ఏం మాట్లాడారో తెలుసుకున్నాక స్పందిస్తా. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పిందే మాకు ఫైనల్. బీఆర్ఎస్తో పొత్తు ఉండదని ఆయన తేల్చేశారు. ఇలాంటి తరుణంలో.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన మాకు అవసరం లేదు అని ఠాక్రే మీడియా ద్వారా స్పష్టం చేశారు. -
కోమటిరెడ్డి పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ‘పొత్తు’ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో అటు అధికార బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండూ.. కాంగ్రెస్ తీరును ఏకిపడేస్తున్నాయి. ఈ తరుణంలో.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తాయని చెబుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. మరోవైపు కోమటిరెడ్డి కామెంట్స్ వీడియోను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోమటిరెడ్డి కామెంట్లపై ఠాక్రే.. కోమటిరెడ్డి కామెంట్లపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. అధిష్టానానికి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపు(గురువారం) ఉదయం ఆయన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఇంకోవైపు రేవంత్ వర్గం ‘కోమటిరెడ్డి వ్యాఖ్యలు’ పార్టీకి తీరని నష్టం చేస్తాయని అంటోంది. అంతేకాదు.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని చెబుతోంది రేవంత్ వర్గం. ఆనాడే కోమటిరెడ్డి చర్య తీసుకునేది ఉండే! కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు సహ నేత అద్దంకి దయాకర్. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి ప్రతిసారీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ గా తీసుకోవాలి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆయనపై హైకమాండ్ యాక్షన్ తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఇలా మాట్లాడే వాడు కాదు. ::: అద్దంకి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్కే ఆ అవసరం ఉండొచ్చు! బీఆర్ఎస్ తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రంలో బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. ఓటమి అంచున ఉన్నది. బీఆర్ఎస్ను ఓడించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఓటమి అంచున ఉన్న బీఆర్ఎస్కు పొత్తులు అవసరం ఉండొచ్చు కానీ, కాంగ్రెస్‌కు ఆ అవసరం లేదు. గతంలోనే తెలంగాణ సభలో కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేయశారు. అంతేకాదు.. పొత్తు గుతించి మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అన్నారు కూడా. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన పూర్తి మెజార్టీ తో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తోంది. :::మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదీ చదవండి: తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీనే: కోమటిరెడ్డి -
రాష్ట్రవ్యాప్తంగా.. ‘హాథ్ సే హాథ్’ యాత్రలు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 26న లాంఛనంగా ప్రారంభమైన ఈ పాదయాత్రలను సోమవారం నుంచి రెండు నెలలపాటు కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ములుగు నియోజకవర్గంలోని మేడారం నుంచి యాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే ములుగు చేరుకున్న కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బలరాంనాయక్, విజయరమణారావు, సిరిసిల్ల రాజయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రేవంత్ మేడారానికి బయలుదేరనున్నారు. ములుగుకు వెళ్లిన తర్వాత గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మేడారం చేరుకుని అక్కడ సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాదయాత్ర ప్రారంభించి కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్, పస్రా జంక్షన్ల మీదుగా రామప్ప గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసిన తర్వాత మలిరోజు ఆ గ్రామం నుంచే పాదయాత్ర ప్రారంభిస్తారని, వారంపాటు అదే నియోజకవర్గంలో తన పాదయాత్ర సాగిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ ఆమోదం తర్వాత భట్టి యాత్ర హాథ్ సే హాథ్ జోడో యాత్రల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కూడా మేడారం వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్రలను ప్రారంభించేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్‌కు ఆమోదం పొందిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ యాత్రలను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరోవైపు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పార్టీ ముఖ్య నేతలందరూ సోమవారం తమ తమ నియోజకవర్గాల్లో హాథ్ సే హాథ్ జోడో యాత్రలను ప్రారంభించనున్నారు. -
Telangana Congress: ఠాక్రే మంతనాలతో కాంగ్రెస్ మూడ్ ఛేంజ్!
సాక్షి, హైదరాబాద్: కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్న స్ఫూర్తితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నియామకమైన తర్వాత రెండు సార్లు రాష్ట్రానికి వచ్చిన ఆయన.. నేతలను కూర్చోబెట్టి మంతనాలు జరపడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలందరితో విడివిడిగా, సామూహికంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలు, అంతర్గత విభేదాలు, భవిష్యత్ వ్యూహాలపై ఆయనకు పూర్తి అవగాహనకు వచ్చినట్టేనని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. ఆయన చర్యల ఫలితంగానే రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడ్ మారిందని, నేతల్లో విభేదాలు దూరం అవుతున్నాయని చెప్తున్నాయి. రెండో దశ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యటించిన ఠాక్రే ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలపై దృష్టి కేంద్రీకరించినా.. వచ్చే ఎన్నికల కోసం పార్టీ నేతలను సన్నద్ధం చేసే పనికి కూడా శ్రీకారం చుట్టారని అంటున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల్లో మూడో దఫా పర్యటనకు రానున్నారని చెప్తున్నాయి. మీ వంతుగా ఏం చేశారు.. ఏం చేస్తారు? తొలి పర్యటనలో పార్టీ సీనియర్లతో విడివిడిగా భేటీ అయిన ఠాక్రే.. తాజా పర్యటనలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలతో సమావేశమయ్యారు. కీలకమైన టీపీసీసీ ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలతో భేటీ అయి చర్చించారు. ఈ సందర్భంగా ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. పార్టీ బలంగా ఉందని, అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, పార్టీలో ప్రాధాన్యత కావాలని కొందరు నేతలు చెప్పడాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన.. ఈ విషయాలన్నీ తాను చూసుకుంటానని, మీ వంతుగా ఏం చేశారు, ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించినట్టు సమాచారం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో మీ టీంలు ఏం పనులు చేస్తున్నాయో చెప్పాలని నేతలను అడిగినట్టు తెలిసింది. తొలుత ఎన్నికలకు సిద్ధమయ్యే దిశలో తమ కమిటీలు, బృందాలను సిద్ధం చేసుకోవాలని.. క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు సమాయత్తం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా ఠాక్రే తన రెండో పర్యటనలోనే బహిరంగ సభకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. చదవండి: రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్‌ను ఓడించలేమా? -
మాజీ ఎంపీలూ.. మీరేం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో గెలుపు కోసం ఏం చేస్తారో చెప్పాలని ఐదుగురు మాజీ ఎంపీలను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రశ్నించారు. మాజీ ఎంపీ హోదా, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టు, పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శక్తి మేరకు పనిచేయాలని సూచించారు. ఆదివారం మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్‌లు గాంధీభవన్‌లో ఠాక్రేను కలి శారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని పార్టీ పరి స్థితులు, ఇతర రాజకీయ పార్టీల బలాలు, బలనతలు, బీజేపీ వైఖరి, బీఆర్ఎస్ ఏర్పాటు వల్ల మారే రాజకీయాలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలని ఠాక్రే సూచించారు. ఫిబ్రవరి ఆరు నుంచి జరగనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రాష్ట్రంలో వీలైనన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాల న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని, మార్గనిర్దేశం చేసే నాయకులు ఏకమైతే అధికారంలోకి రావడం కష్టమేమీ కాదని మాజీ ఎంపీలు వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలోని పార్టీ నేతలందరినీ ఏకం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిసింది. -
కొట్లాటలు ఇంకా ఎన్ని రోజులు.. నేతలకు క్లాస్ ఇచ్చిన ఠాక్రే!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26న హాథ్ సే హాథ్ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించి ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలలపాటు ఈ యాత్రలను ఘనంగా కొనసాగించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ‘ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా యాత్రలను ప్రారంభించాలి. ఆ తర్వాత 30న శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపునకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతోపాటు ముఖ్య నేతలు అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమావేశం ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. 5న రాష్ట్ర బడ్జెట్ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్రలను రెండు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలి’ అని సమావేశం తీర్మానించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన శనివారం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి హాథ్ సే హాథ్ జోడో యాత్రల కోసం ఏఐసీసీ నియమించిన సమన్వయకర్త గిరీశ్ చోడంకర్, పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్చార్జి కార్యదర్శులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగానే హాథ్ సే హాథ్ జోడో యాత్రల నిర్వహణపై పలువురు నేతలు మాట్లాడారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాక మాణిక్‌రావ్ ఠాక్రే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ తనకిచ్చిన బాధ్యతల నిర్వహణ, పార్టీ భవిష్యత్తు, నేతల పనితీరు, హాథ్ సే హాథ్ జోడో యాత్రల నిర్వహణ, ఎన్నికలను ఎదుర్కొనే అంశాలపై కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆయన మార్గదర్శనం చేశారు. పార్టీ బాగుంటేనే మీ భవిష్యత్తు బాగు.. ‘భారత్ జోడో యాత్రతో ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు రాహుల్‌గాంధీ కృషి చేస్తున్నారు. ఈ యాత్ర లక్ష్యాన్ని రాష్ట్రంలో ప్రతి గడపకూ తీసుకెళ్లే బాధ్యత మీ అందరిదీ. అలాగే అందరూ సమష్టిగా పనిచేసి హాథ్ సే హాథ్ జోడో యాత్రలను విజయవంతం చేయాలి. పార్టీ భవిష్యత్తు బాగుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలి. పార్టీ అంతర్గత విషయాలు ఏవైనా నాతో మాట్లాడండి. నేను ఎవరికీ అనుకూలం కాదు... వ్యతిరేకమూ కాదు. నేతలెవరూ పార్టీకి నష్టం కలిగేలా మీడియా ముందు మాట్లాడొద్దు. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా సీనియర్లు ఎక్కువ నియోజకవర్గాల్లో యాత్రలు చేయాలి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కూడా 40–50 నియోజకవర్గాల్లో యాత్రల్లో పాల్గొంటారు. మనం బలహీనపడుతున్నామనే భావనతో బీజేపీ ఉత్తరాదిన చేస్తున్న రాజకీయాలనే తెలంగాణలో చేయాలని చూస్తోంది. కానీ బీజేపీ ఆటలు సాగవు. 100 శాతం మనం గెలవబోతున్నాం’ అని ఠాక్రే పీసీసీ కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సమావేశాలకు రాని వారిపై చర్యలు.. కార్యవర్గ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ఫిబ్రవరి 6న జరిగే హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రల ప్రారంభ కార్యక్రమంలో సోనియా లేదా ప్రియాంకా గాంధీల్లో ఒకరు పాల్గొనేలా చూడాలని ఠాక్రేను కోరారు. లక్ష మందితో జరిగే ఈ సభలో వారిద్దరిలో ఒకరిని పాల్గొనాలని కోరుతూ ఏఐసీసీ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే కొత్త ఇన్చార్జి ఠాక్రే వచ్చాక నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని వారి నుంచి వివరణ కోరాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రేవంత్ ఆదేశించారు. గడపగడపకూ ‘భారత్‌జోడో’ స్టిక్కర్, రాహుల్ లేఖ సాక్షి, హైదరాబాద్: హాథ్‌సే హాథ్ జోడో యాత్ర లను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. బ్లాక్‌లు యూనిట్‌గా అన్ని గ్రామాల్లో యాత్రలు నిర్వహించనుంది. ఈ యాత్రల్లో ప్రతి గడపకూ భారత్‌జోడో యాత్ర స్టిక్కర్ అంటించాలని, తన యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు రాసిన లేఖను తెలుగులో అనువదించి అందరికీ ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ వేసే చార్జిషీట్లను కూడా గ్రామగ్రామాన పంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది. -
రేవంత్, ఠాక్రేతో ముగిసిన కోమటిరెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది కాలం తర్వాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో కూడా కోమటిరెడ్డి భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ ఎదుట వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో గౌరవం దక్కాలి. అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలి. ఇవన్నీ జరిగితే నేను మరింత ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని ప్రజల మనసులో ఉంది. హాత్ సే జోడో యాత్ర ఎలా చేయాలనే అంశంపై చర్చించాము. అంతర్గత విషయాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరాను. 50 శాతం టికెట్స్ ముందే ఇవ్వాలని సూచించాను. గాంధీభవన్‌కు రావడం తగ్గించి నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉండాలి. ఇన్ఛార్జ్ కూడా జిల్లాల వారీగా తిరగాలని చెప్పాను. నియోజకవర్గాల్లో ఒకవేళ ఎక్కువ పోటీ ఉంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచనలు చేశాను. జన సమీకరణ చేసి ఉద్యమాలు చేయాలని కోరాను. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలో చర్చించినట్టు తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయి. నాకు, రేవంత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ బలమైన పార్టీ. బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాడుతాము అని స్పష్టం చేశారు. -
ఎన్ని గెలుస్తాం.. ఎలా అధికారంలోకి వస్తాం?
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? గతం కంటే బలపడుతున్నామా? బలహీనపడుతున్నామా? మనకు గతంలో వచ్చిన 26–28 శాతం ఓట్లు 40 శాతానికి చేరాలంటే ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 119 స్థానాల్లో ఎన్నిచోట్ల మనం గెలుస్తాం? 60 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? పార్టీలో అంతర్గత సమస్యలేంటి? ఎందుకీ విభేదాలు..?’’.. రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఇక్కడి నేతల నుంచి లోతుగా ఆరా తీస్తున్న అంశాలివి. వీటితోపాటు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల పరిస్థితి ఏమిటి, వాటి విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైనా ఆయన సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా నియామకం అయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మాణిక్‌రావ్ ఠాక్రే బుధవారం గాంధీభవన్ వేదికగా బిజీబిజీగా గడిపారు. దాదాపు 20 మంది నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలను తెలుసుకున్నారు. నేతలు చెప్పేది వింటూ, మధ్యలో ప్రశ్నలు అడుగుతూ వివరాలన్నింటినీ నోట్ చేసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శులతో మొదలు మాణిక్‌రావ్ ఠాక్రే బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. సుమారు పదిన్నర గంటల సమయంలో మాణిక్‌రావ్ ఠాక్రే గాంధీభవన్‌కు చేరుకోగా.. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాణిక్‌రావ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వెంటనే భేటీలు మొదలుపెట్టారు. తొలుత ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలతో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులు, ఏఐసీసీతో సమన్వయం, అధిష్టానం వద్ద ఉన్న పార్టీ సమాచారం, హాత్‌సే హాత్ జోడో యాత్ర ప్రణాళిక తదితర అంశాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం. వరుసగా సమావేశాలు అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో విడివిడిగా అరగంట పాటు మాణిక్‌రావ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, హాత్‌సే హాత్ జోడో యాత్ర విజయవంతంపై చర్చించారు. పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆనక సాయంత్రం దాకా వరుసగా సీనియర్ నేతలు వీహెచ్, అజారుద్దీన్, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, షబ్బీర్‌అలీ, మహేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, రేణుకాచౌదరి తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటల సమయంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు సాగింది. నేడు కూడా సమావేశాలు గురువారం రెండోరోజు పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మాణిక్‌రావ్ ఠాక్రే సమావేశం కానున్నారు. టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయిన అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. మాట్లాడుతూ.. మాట్లాడిస్తూ.. యువజన కాంగ్రెస్‌లో పనిచేసినప్పటి నుంచీ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేసిన మాణిక్‌రావ్ ఠాక్రే.. రాష్ట్రంలో 2023 ఎన్నికలే లక్ష్యంగా నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ పరిస్థితి, అధికారంలోకి వచ్చేందుకు ఉన్న మార్గాలపై ఆయన ఎక్కువ ఫోకస్ చేశారని.. నేతల మధ్య విభేదాలకు కారణాలు, సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారని సమాచారం. ఆయన తాను మాట్లాడుతూనే.. రాష్ట్ర నాయకులతో కూడా మాట్లాడించేలా ప్రశ్నలు వేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఠాక్రేతో సమావేశమైన పలువురు నేతలు.. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని, సరైనదిశలో తీసుకెళ్లలేకపోవడమే ప్రధాన సమస్య అని వివరించినట్టు సమాచారం. పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఏ ఒక్కరితోనో సాధ్యం కాదని.. కలసికట్టుగా ముందుకెళ్లాల్సి ఉంటుందని, దానికి మీరే మార్గం కనుక్కోవాలని కొందరు నేతలు పేర్కొన్నట్టు తెలిసింది. ఇటీవల నియమించిన కమిటీలు, పార్టీలో సమాచార లోపం తదితర అంశాలపైనా ఠాక్రేకు వివరించినట్టు సమాచారం. మొత్తమ్మీద తొలిరోజు 12 గంటలకుపైగా ఆయన సమావేశాలు నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఠాక్రే ఫోన్ కొత్త ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. బుధవారం తాను గాంధీభవన్‌కు వస్తున్నానని, వచ్చి కలవాలని ఠాక్రే కోరగా.. తాను నియోజకవర్గంలో జరిగే సమావేశానికి వెళుతున్నానని, వచ్చిన తర్వాత కలుస్తానని వెంకటరెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఠాక్రేతో సమావేశమయ్యేందుకు గాంధీభవన్‌కు రావాలంటూ టీపీసీసీ నుంచి కూడా వెంకటరెడ్డికి సమాచారం వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాణే..కు పిలుపు రాలే!
సాక్షి, ముంబై: మంత్రి పదవికి రాజీనామా చేసి వారంరోజులు దాటినా నారాయణ్ రాణేకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి ఆఫర్లు రాలేదు. కనీసం అధిష్టానం నుంచి పిలుపు కూడా రాకపోవడంపై రాణే వర్గీయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పనితీరుతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన రాణే వారంరోజుల క్రితం మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. రాజీనామా చేయడం ద్వారా ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్‌తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నారాయణ్ రాణే వ్యూహం ఫలించినట్టు కన్పించడంలేదు. పైగా బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణే తన డిమాండ్లను వినిపించిన సంగతి కూడా తెలిసిందే. అయితే అదే రోజు రాత్రి వర్షా బంగ్లాలో ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే, ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్, రాణే సమావేశం కావడం, ఆ సమావేశంలో కూడా రాణే తన డిమాండ్లను వారి ముందుంచినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణే డిమాండ్లను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పడంతో అప్పటికి సంతృప్తి వ్యక్తం చేసిన రాణేకు నిరాశే ఎదురైంది. రాణే డిమాండ్లపై అధిష్టానం నుంచి స్పందన కరువైంది. పరిస్థితిని ముందే గమనించిన రాణే స్వయంగా గురువారం ఢిల్లీ బాటపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకు వెళ్లిన ఆయన రాహుల్ గాంధీతో భేటీ అయిన అనంతరం వెనుతిరగాల్సివచ్చింది. ముఖ్యంగా రెవెన్యూశాఖ మంత్రి పదవితోపాటు , పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కావాలని రాహుల్ గాంధీని కోరారని, అప్పటికి రాహుల్ నుంచి ఎటువంటి హామీ లభించకపోయినా సోనియాతో మాట్లాడతానని మాత్రమే రాహుల్ సమాధానమిచ్చి తిప్పి పంపినట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇది జరిగి కూడా అయిదు రోజులు పూర్తయింది. అయినప్పటికీ రాణే డిమాండ్లపై కాంగ్రెస్ అధిష్టానం ఇంత వరకు నోరు విప్పలేదు. దీంతో రాణే వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై రాణే కూడా మరో ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. -
పనితీరుపైప్రచారం
ముంబై: గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు నెరవేర్చిందో తెలియజెప్పేందుకు ప్రజల్లోకి వెళ్లనున్నట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఠాక్రే సమావేశం అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు వాగ్దానాలను చేసిందని, వాటిని నమ్మి పార్టీని గెలిపించిన ఓటర్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం తమ పనితీరును, నేరవేర్చుకున్న వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మోడీ ప్రభావమేమీ పెద్దగా ఉండదు.. ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ మోడీ పేరును ప్రకటించినా పెద్దగా ప్రభావమేమీ ఉండదని ఠాక్రే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఓడించడం ఆసాధ్యమన్నారు. బీజేపీ వెనుక ఆరెస్సెస్ ఉందనే విషయం మోడీ పేరును ప్రకటించిన సందర్భంగా తేటతెల్లమైందన్నారురు. ఇక దభోల్కర్ హత్య ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగిందని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఆరోపించడంపై మాణిక్‌రావ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేడం రాజ్‌ఠాక్రేకు అలవాటేనని విమర్శించారు