బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా సంజయ్‌: కేటీఆర్‌ | Telangana: Minister KTR Counter To JP Nadda Comments On CM KCR | Sakshi
Sakshi News home page

బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా సంజయ్‌: కేటీఆర్‌

Published Wed, Jan 5 2022 4:19 PM | Last Updated on Wed, Jan 5 2022 7:36 PM

Telangana: Minister KTR Counter To JP Nadda Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమ నేత కేసీఆర్ మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. జేపీ నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి, చదువుకున్న, జ్ఞానం ఉన్నోడు అనుకున్నాం కానీ.. బండి సంజయ్, నడ్డాకు తేడా లేదని విమర్శించారు. జేపీ నడ్డా అంటే.. అబద్దాల అడ్డా అని, నడ్డాను ఎర్రగడ్డాకు పంపించాలని మండిపడ్డారు. బీజేపీ అంటే బక్వస్ జుమ్లా పార్టీ అని దుయ్యబట్టారు. దేశంలోనే మొదటిసారి ప్రధానిని రైతులు వెనక్కి పంపించారని, రైతులు ప్రధానిని అడ్డుకున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని అన్నారు.

దేశానికి బీజేపీ చేసిందేం లేదు గానీ చిల్లర రాజకీయాలు చేస్తూ హిందూ, ముస్లింల మధ్య గొడవ పెడుతోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుకోవడానికి అరపైసా పనిచేయని దిక్కుమాలిన ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యం గురించి దెయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. నిన్న రైతులను రెచ్చగొట్టి.. నేడు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు.
చదవండి: బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

‘మోదీ పాలనలో సబ్‌కా సాత్‌.. సబ్‌కా వినాశ్‌.. సామాన్యుడికి శోకం.. కార్పొరేట్లకు కనకాభిషేకం. కాళేశ్వరం విషయంలో మెంటల్‌ బ్యాలెన్స్‌  మీకు పోయిందా?.. మీ మంత్రికి పోయిందో తెలుసుకోండి. కేసీఆర్‌ ఇంటికే కాళేశ్వరం నీళ్లు పోతున్నాయని అన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం అని మీ జలశక్తి శాఖనే చెప్పింది. కాళేశ్వరం గురించి మాట్లేందుకు సిగ్గుందా. సొంత నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మించాం. కేంద్ర అధికారులు కేసీఆర్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నారు.

కేసీఆర్‌ తెలంగాణ ఏటీఎం అంటున్నారు. అవును అన్నదాతకలు తోడుండే మిషన్‌. బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా సంజయ్‌.  మా ప్రభుత్వ పథకాలు. మీ ప్రచార అస్త్రాలు.. చీకట్లో గాడ్సే గొప్పోడు అంటారు. నిన్నేమో గాంధీ ముందు మోకారిల్లుతున్నారు. సిగ్గుందా నడ్డా నీకు.. రైతులను ఘోస పెట్టిన ఘనత మీది.  రైతులను ఇంతలా గోస పుచ్చుకున్నది ఎవరూ లేదు’ అని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement