
బూర్గంపాడు: తెలంగాణలో యువకులు డిగ్రీలు, పీజీలు చదివి హమాలీలుగా, ఆటో డ్రైవర్లుగా బతుకు తున్నారని.. మరి కొందరైతే ఆ పని కూడా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నిరుద్యోగ తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య చదివిన వారు కూడా రూ.5వేలు, రూ.10వేల జీతానికి పని చేస్తు న్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ రుణాల కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్కరికీ రుణం ఇవ్వలేద న్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కమీషన్ దండుకోవడం ఒక్కటే కేసీఆర్‌కు తెలిసిన విద్య అని విమర్శిం చారు. ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటించి నిరాహార దీక్షలు చేస్తున్నా మని, అందుకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేత ఏపూరి సోమన్న బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment