సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో రెండు భిన్న ధ్రువాలుగా పేరున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.., ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంగళవారం కలిశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటిసారి కోమటిరెడ్డిని రేవంత్‌రెడ్డి కలిశారు. ఇద్దరూ కలిసి సీఎం కేసీఆర్‌నే టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానికి హ్యాపీ టైమ్స్ అని కామెంట్ జత చేశారు. ఇక ఇద్దరు లీడర్లు ఒకే ఫ్రేమ్‌లోకనిపించడంతో అటు పార్టీలో, ఇటు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. అస్సాం సీఎంపై కేసు నమోదు
కోమటిరెడ్డిని కలిసినన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం దొంగ రాజీనామాలు చేసిందని దుయ్యబట్టారు.. అస్సాం సీఎంపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదన్న రేవంత్‌రెడ్డి.. రేపు ఎస్పీ, కమిషనరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ యూపీఏ భాగస్వామ్య పార్టీలను కేసీఆర్ చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మోదీ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎప్పటికీ కలబోవని స్పష్టం చేశారు.
చదవండి: కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు సిద్ధం.. కానీ: కిషన్‌రెడ్డి
ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ అంటూ నేడు(మంగళవారం) కాంగ్రెస్ వరి దీక్షలకు దిగింది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. దీంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసిపోవడంతో క కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండిందనే చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కొంత అస్పష్టతతో ఉన్న కార్యకర్తల్లోని అనుమానాన్ని ఈ రోజు వరి దీక్ష వేదిక నుంచి కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు తరిమికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment