
సాక్షి, అమరావతి: దేవాలయాలను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ పార్టీల ముసుగులో రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఈ కుట్రలను ఛేదిద్దామని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవదాయ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన ఆ శాఖ కమిషనర్ పి. అర్జునరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే..
► కొందరు పనిగట్టుకుని దేవాలయాలపై కుట్రలు చేస్తున్నారు. జిల్లాలో పనిచేసే అసిస్టెంట్ కమిషనర్‌లతో పాటు రీజనల్ కమిషనర్లు, డిప్యూటి కమిషనర్, తమ పరిధిలోని గ్రామల్లో తరచూ పర్యటించి.. అక్కడ గ్రామ కమిటీలతో పాటు స్థానికులతో సమావేశమై వారి సూచనలను తెలుసుకుంటూ ఉండాలి.
► దేవాలయాలు, రథాల భద్రత కోసం ఏర్పాటుచేసే సీసీ కెమెరాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment