
విశాఖ 18వ వార్డులో విజయసాయిరెడ్డి ప్రచారం. చిత్రంలో మంత్రి కన్నబాబు, ఎంపీ సత్యనారాయణ తదితరులు
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందాలని, అది సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. నాడు మహానేత వైఎస్సార్‌తో విశాఖ ప్రగతి సాధిస్తే.. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ చొరవతో నగరం అభివృద్ధిపథంలో నడుస్తోందన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర, తూర్పు నియోజకవర్గాల్లోని పలు వార్డుల్లో మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టితో కలిసి ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల్లో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడని.. అక్కడ నుంచి పారిపోయి వచ్చి విశాఖ ప్రజలపై పెత్తనం చేస్తున్నాడని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక నియో జకవర్గంలో గెలిచి మరో నియోజకవర్గానికి మారిపోవడమేగానీ గెలిచినచోట ప్రజల స మస్యలు ఆయనకు పట్టవని ఎద్దేవా చేశా రు. మీలో ఒకరు, మంచి వ్యక్తయిన కేకే రాజును గెలిపించుకోవాలని పిలుపునిచ్చా రు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి టీడీపీని పూర్తిస్థాయిలో భూస్థాపి తం చేయాలని కోరారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గొల్ల బాబురా వు, పార్టీ సమన్వయకర్తలు కేకే రాజు, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.