
మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వస్తే.. సీఎం జగన్ స్వయం కృషితో అధికారం చేపట్టారన్నారు.
చదవండి: విషం చిమ్మబోయి.. వెల్లకిలా పడిపోయి..
టీడీపీ హయాంలో వీధికో బెల్టు షాపు ఉంటే.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టూరిజం అభివృద్ధిపై విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో రాజమండ్రి పోలీసు కమిషనరేట్‌గా మారనుందని మార్గాని భరత్ పేర్కొన్నారు.