డీఆర్‌డీఏ పీడీగా నారాయణ బాధ్యతల స్వీకరణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా టి.నారాయణ బుధవారం ప్రగతి భవన్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు.
వారబంధి పకడ్బందీగా అమలు చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: వారబంధి విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జున సాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలని చెప్పారు. వస్తున్న నీటిని పరిగణనలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని దిశానిర్దేశం చేశారు. రైతులు కూడా సాగు అవసరాలకే వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా అధికార యంత్రాంగానికి సహకరించేలా అవగాహన కల్పించాలని సూచించారు. గత డీఆర్‌సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తీసుకున్న సమస్యలపై ఆరా తీశారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, ప్రాజెక్టు ఎస్‌ఈ నాగమురళి, ఇరిగేషన్ ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.
మార్కాపురాన్ని జిల్లా చేయాలని ధర్నా
మార్కాపురం: మార్కాపురాన్ని వెంటనే జిల్లా చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. 25 మండలాలు కలిపి మార్కాపురాన్ని జిల్లా చేయడంతో పాటు శ్రీశైలాన్ని కూడా మార్కాపురంలో కలపాలని కోరారు. గిద్దలూరులో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, మార్కాపురంలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని, హనుమాన్ జంక్షన్, గొట్లగట్టు, గజ్జలకొండ, తాటిచర్ల మోటు గ్రామాలను మండలాలుగా చేయాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలను సందర్శించిన సంయుక్త సంచాలకులు
నాగులుప్పలపాడు: పాఠశాల విద్య గుంటూరు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లింగేశ్వరరెడ్డి మండలంలోని పోతవరంలో ఎయిడెడ్ పాఠశాల, ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. పాఠశాల నిర్వహణపై ఉపాధ్యాయులతో సమీక్షించి సలహాలు, సూచనలు చేశారు. అదేవిధంగా నాగులుప్పలపాడు హైస్కూలు ఆవరణలో జరుగుతున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలంతా ఆరు రోజుల పాటు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి టి.రవి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం వెంకట సుబ్బయ్య, రిసోర్స్ పర్సన్లు మాలకొండయ్య, నాగరాజు, సూపర్‌వైజర్లు ఉషారాణి, శ్రీదేవి పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీగా నారాయణ బాధ్యతల స్వీకరణ
డీఆర్‌డీఏ పీడీగా నారాయణ బాధ్యతల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment