పరీక్ష.. ప్రహసనం
తీర్పు తర్వాతే పరీక్షలు పెడితే బాగుండేది
రోస్టర్ వివాదం న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం. చివరి నిమిషంలో ఏదో హడావుడి చేయడం కంటే న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తే ఎంతో బాగుండేది. గత రాత్రి వరకు కూడా పరీక్షలు జరుగుతాయో లేదో అనే ఆందోళనలో సరిగా చదవలేకపోయాం. మాకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
– సుమంత్, గ్రూప్ 2 అభ్యర్థి
పరీక్షలకు మరింత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది
గ్రూప్ 2 పరీక్షల విషయంలో రోస్టర్ వివాదం తలెత్తడంతో అసలు పరీక్షలు జరుగుతాయో లేదో అనే సందేహంతో అనేక మంది అభ్యర్థులు సరిగా ప్రిపేర్ కాలేదు. చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల్లో పరీక్షలు జరుగుతాయన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించలేకపోయింది. ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రిపేర్ కావడానికి మరికొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది.
– వెంకటేష్, గ్రూప్ 2 అభ్యర్థి
ఒంగోలు సిటీ:
జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ప్రహసనంగా సాగింది. పరీక్ష వాయిదా అంటూ ప్రభుత్వం లీకులిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంది. మూడు రోజులుగా అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయండి అని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు బ్యాంకు కోసమే వాయిదా వేయకుండా పబ్బం గడుపుకుందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఒంగోలు, నగర శివారు ప్రాంతాల్లోని ఐదు కేంద్రాల్లో ఏడు సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 4,544 మంది అభ్యర్థులను కేటాయించారు. అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4544 మంది అభ్యర్థులకుగాను ఉదయం 3,968 (87.32%) మంది, మధ్యాహ్నం 3,965 (87.25%) మంది పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ:
కలెక్టర్ తమీమ్‌అన్సారియా క్విస్ కాలేజీ, రైస్, పేస్ కాలేజీ సెంటర్లను తనిఖీ చేశారు. పరీక్షల్లో అభ్యర్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జున డిగ్రీ కాలేజీ, హర్షిణి, క్విస్, పేస్ కాలేజీల సెంటర్లను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి తనిఖీ చేశారు. గ్రూప్ 2 భద్రతా ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల పరిసరాల్లోజిరాక్స్‌సెంటర్లు మూయించామని, రైల్వే, బస్ స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ ద్వారా కూడా భద్రత పర్యవేక్షించినట్లు తెలిపారు. పరీక్షలు ముగిసిన తరువాత పటిష్టమైన భద్రత మధ్య జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూంకు తరలించినట్లు చెప్పారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సీఐ అజయ్ కుమార్, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, సింగరాయకొండ సీఐ హజరత్తయ్య ఉన్నారు.
హడావుడిగా గ్రూప్ 2 పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు రోస్టర్ సమస్య పరిష్కరించకుండా పరీక్షల నిర్వహణపై ఆగ్రహం చాలా మంది పరీక్షలకు గైర్హాజరు సరైన సమయంలో బుద్ధిచెప్తామంటున్న అభ్యర్థులు దాగుడుమూతలు ఆడిన కూటమి ప్రభుత్వం
కూటమికి బుద్ధి చెప్తామంటున్న అభ్యర్థులు
రెండు రోజులుగా కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గ్రూప్–2 మెయిన్స్ వాయిదా వేస్తామని లీకులు ఇస్తూ పచ్చమీడియా తో తప్పుదోవ పట్టించాడని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడుగా ఏపీపీఎస్‌సీ చైర్మన్ మాట వినడం లేదంటూ దొంగ నాటకాలు ఆడుతూ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. దీంతో అభ్యర్థులు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తామని కరాఖండిగా ఉన్నారు.
ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్రంలో పరీక్ష రాసేందుకు వస్తున్న అభ్యర్థులు
పరీక్ష.. ప్రహసనం
పరీక్ష.. ప్రహసనం
పరీక్ష.. ప్రహసనం
Comments
Please login to add a commentAdd a comment