
కూల్చివేతలకు నిరసనగా రాస్తారోకో
ఒంగోలు సబర్బన్: ఒంగోలు–కొప్పోలు రోడ్డులో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు అడ్డగోలుగా చేస్తున్న కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక రైల్వే ఫ్‌లై ఓవర్‌కు తూర్పు వైపున సోమవారం నగర పాలక సంస్థ అధికారులు రోడ్డుపక్కన ఉన్న భవనాలను కూల్చివేయటం ప్రారంభించారు. స్థానిక ఎఫ్‌సీఐకి ఎదురుగా ఉన్న ఇందిరా కాలనీ ప్రజలు అందుకు వ్యతిరేకించి కూల్చివేతలను అడ్డుకున్నారు. రోడ్డుపై రాళ్లు పెట్టిమరీ నిరసనకు దిగారు. దాంతో ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 100 అడుగుల రోడ్డు పేరుతో సంబంధం లేని భవనాలను కూడా కూలుస్తున్నారంటూ నినాదాలు చేశారు. దాంతో నగర పాలక సంస్థ అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. ఒంగోలు తాలూకా పోలీసులు స్థానికులను అక్కడ నుంచి తొలగించారు. లోకాయుక్తలో రోడ్డు మార్జిన్‌లో ఉన్న ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించటం వల్లనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని నగర పాలక సంస్థ అధికారులు స్థానికులకు చెప్పి ఆందోళనను విరమింపజేశారు. అయితే ఓ టీడీపీ నాయకుడు రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించి నిర్మించిన ఇంటి జోలికి వెళ్లకుండా నామమాత్రంగా తొలగించి దానికి ఇరువైపులా ఉన్న వేరే వారి భవనాలు కూల్చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టడంతో రాకపోకలకు అంతరాయం 100 అడుగుల రోడ్డు పేరుతో భవనాల కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment