● అజ్ఞాత వ్యక్తి చేతిలో రూ.68 వేలు పోగొట్టుకున్న యువకుడు
పెద్దదోర్నాల: జీఎస్టీ కింద కొంత నగదు చెల్లిస్తే ప్రభుత్వం నుంచి మంజూరైన రుణాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి పెద్దదోర్నాలకు చెందిన యువకుడు మోసపోయాడు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఈ నెల 15వ తేదీన దోర్నాలకు చెందిన ఓ యువకుడికి 86098 93880 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీకు ప్రభుత్వం నుంచి రుణం మంజూరైందని, జీఎస్టీ డబ్బు కొంత చెల్లిస్తే నగదు జమవుతుందని నమ్మబలికాడు. వారం వ్యవధిలో రూ.68 వేల రూపాయలు గుంజాడు. రుణం ఇంకా రాలేదేంటి అని బాధిత యువకుడు ప్రశ్నించగా మరికొంత చెల్లించాలని చెప్పుకొచ్చాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు, సైబర్ సెల్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసిన వ్యక్తి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని బాధిత యువకుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment