
ఫార్మర్ విశిష్ట నంబర్ల కోసం ప్రత్యేక క్యాంపులు
● జేడీఏ శ్రీనివాసరావు
దొనకొండ: జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ ఐడీల కోసం క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ఆరవెల్లిపాడు గ్రామ రైతు సేవాకేంద్రంలో ఏర్పాటు చేసిన క్యాంపు ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు పొలం ఉన్న ప్రతి రైతుకు విశిష్ట సంఖ్యను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. నమోదు సమయంలో ఆధార్‌కార్డుకు లింక్ అయిన ఫోన్ నంబరుకు మూడుసార్లు ఓటీపీలు వస్తాయన్నారు. వాటిని గ్రామ వ్యవసాయ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. రైతులు పొలం పాస్‌బుక్, ఆధార్‌కార్డు, ఆధార్‌కార్డుకి లింక్ అయిన ఫోన్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకులను కలవాలన్నారు. రైతులు రెండు కన్నా ఎక్కువ రెవెన్యూ గ్రామాల్లో పొలం ఉంటే ఎక్కడో ఒక చోట ఫార్మర్ ఐడీ చేయించుకుంటే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో సాంకేతిక వ్యవసాయాధికారి శ్రీనివాస నాయక్, ఏడీఏ బాలాజినాయక్, మండల వ్యవసాయాధికారి ఎన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment