స్కూటర్‌కు మంటలు
మార్కాపురం: పార్కింగ్ చేసిన స్కూటర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన సోమవారం మార్కాపురం పట్టణంలో చోటుచేసుకుంది. తర్లుపాడుకు చెందిన ఓ వ్యక్తి తన స్కూటర్‌ను మార్కాపురం పట్టణంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు వద్దగల ఆంజనేయస్వామి గుడి పక్కన దుకాణం ముందు పార్కింగ్ చేశాడు. మధ్యాహ్నం సమయంలో స్కూటర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సమీపంలో ఉన్న వారు స్పందించి మంటలు అదుపుచేశారు. ప్రమాదానికి కారణం షార్టు సర్క్యూటా.. ఎండ వేడి వల్లా అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment