ఒంగోలు సిటీ: మార్కాపురం ఎయిడెడ్ ఉపాధ్యాయుల జాయినింగ్ సమస్యను డీఈఓ కిరణ్‌కుమార్ తక్షణమే పరిష్కరించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మార్కాపురం ఆజాద్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని, వారిని మార్కాపురం మండల ఎంఈఓ రిలీవ్ చేసి ఫిబ్రవరి 25న తర్లుపాడు ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలకు పంపించారని తెలిపారు. ఆ పాఠశాల యాజమాన్యం వారిని విధుల్లో చేర్చుకోలేదన్నారు. ఆ మండల ఎంఈఓ ఆ ఉపాధ్యాయులను మీరు డీఈఓ దగ్గరకి వెళ్లాలని చెప్పారన్నారు. రిలీవ్ చేసే ఎంఈఓలు జాయిన్ చేసుకునే విషయంలో సమస్య పరిష్కరించాలేగానీ.. ఉపాధ్యాయులను డీఈఓ దగ్గరకు వెళ్లమని చెప్పడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment