జాతీయ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా పోలీసులు
ఒంగోలు టౌన్: జాతీయ స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన పోలీసులు సత్తా చాటారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు బెంగళూరులో 45వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ఫిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా పోలీసు శాఖ నుంచి 30 ప్లస్ ఏజ్ గ్రాప్ విభాగంలో పోలీసులు సత్తా చాటారు. ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సురేష్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో రెండు సిల్వర్, 4‘100 మీ, 4్ఙశ్రీ400 మీటర్ల రిలే పోటీల్లో రెండు బ్రాంజ్ పతాకాలను సాధించారు. పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావు 4్ఙశ్రీ 100, 4్ఙశ్రీ400 మీటర్ల పోటీల్లో రెండు బ్రాంజ్ పతకాలను సాధించారు. పోటీల్లో ప్రతిభ చాటిన ఆర్‌ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ శ్రీనివాసరావులను మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్ బాబు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్‌ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment