మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
కనిగిరిరూరల్: పట్టణంలోని ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఇచ్చారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో మేము సైతం అంటూ కార్మికులు భాగస్వాములయ్యారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ దువా, విందులో మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్, సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సయ్యద్ యాసీన్‌న్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మతసామరస్యతకు ప్రతీకగా.. సోదర, స్నేహ భావాన్ని పెంపొందిచే విధంగా ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడాన్ని కొనియాడారు. సీపీఐ కార్యదర్శి సయ్యద్ యాసీన్ మాట్లాడుతూ లౌకిక విలువలు కాపాడుతూ.. ప్రజల్లో ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించే విధంగా కర్షక వర్గాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమంగా కొనియాడారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాది సుమైర్, నజీర్‌బాష, ఎస్‌కే సందాని, ఫయాజ్, గండికోట రవి, ఎస్‌కే వలి, బాషా, నాయబా, అసోసియేషన్ నాయకులు, మదర్ థెరిసా సేవా సమితి అధ్యక్షుడు ఎస్ ఎన్ రసూల్, మండ్రు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment