‘యువత పోరు’ను జయప్రదం చేయండి
దర్శి (కురిచేడు): ఒంగోలులో బుధవారం జరిగే యువతపోరును జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు ప్రభుత్వం ఇవ్వకపోవటంతో అనేక మంది కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో విద్యా దీవెన, వసతి దీవెన కింద ఏటా స్కాలర్ షిప్ లు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత వరకు ఎటువంటి ఫీజులు చెల్లించలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు అయినా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి చెల్లించలేదని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షులు కాకర్ల కృష్ణారెడ్డి, యన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, ఇత్తడిదేవదానం, జెడ్పీటీసీలు రత్నరాజు, నుసుం వెంకట నాగిరెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా యూత్ అధ్యక్షుడు జీ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యం దేవప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీ సూదిదేవర అంజయ్య, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, దర్శి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment