శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
● వెలుగొండకు కావాల్సింది కొండంత.. విదిల్చింది గోరంత
● రూ.359 కోట్లతో సరిపెట్టిన బాబు సర్కార్
● ఆర్‌ఆర్ ప్యాకేజీకి రూ.1000 కోట్లు అవసరమైతే ఇచ్చింది రూ.116 కోట్లే
● తెలుగు తమ్ముళ్లకు ఏటీఎంగా గుండ్లకమ్మ నిధులు
● తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు కేటాయింపులపై పెదవి విరుపు
● ఉచిత బస్సు ఊసు లేదు
● బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు అత్తెసర నిధులు
నేటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలకు మొత్తం 42,439 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం పరీక్షలు 21,624 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 20,815 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులను, 1089 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరికి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
బాలికను గర్భవతిని చేసి పరారైన యువకుడు
ఒంగోలు టౌన్: నగరానికి చెందిన ఒక యువకుడు మాయమాటలతో బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరానికి చెందిన షేక్ ఆరీఫ్ అనే 25 ఏళ్ల యువకుడు స్థానిక మంగళపాలెంలోని స్నేహితుడి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి మేనత్త కూతురైన 18 ఏళ్ల బాలికతో అతనికి పరిచయమైంది. తరచూ ఆమెతో ఇన్‌స్ర్ట్రాగామ్ చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన పిన్ని కూతురు పుట్టిన రోజని, కేక్ కటింగ్ జరుగుతుందని మాయమాటలు చెప్పి పేర్నమిట్టలోని గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక నెలతప్పడంతో సమాచారం తెలుసుకున్న ఆరీఫ్ ఊరి నుంచి పరారయ్యాడు. వాకబు చేయగా ఆరిఫ్‌కు అప్పటికే పెళ్లయిందని తెలిసింది. దాంతో మోసపోయానని గ్రహించిన బాధిత బాలిక జరిగిన విషయాన్ని తలిదండ్రులకు తెలియజేసింది. వారు ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అజయ్‌కుమార్ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రి హత్య కేసులో కొడుక్కి జైలు
చీమకుర్తి: బండ్లమూడి గ్రామంలో తండ్రిని హత్యచేసిన సంఘటనలో కొడుకుకి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించినట్లు సీఐ ఎం.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. వనిపెంట లక్ష్మారెడ్డిని ఆయన కుమారుడు చంద్రశేఖరరెడ్డి 15 రోజుల క్రితం మెడపై గొడ్డలితో వేటు వేయగా తీవ్ర గాయాలైన లక్ష్మారెడ్డి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న మృతి చెందాడు. తండ్రి కొడుకుల మధ్య ఆస్తి వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది. తండ్రిపై హత్యకు పాల్పడిన కొడుకు చంద్రశేఖరరెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.
పోలీసుల అదుపులో జంట హత్యల కేసు నిందితుడు
మార్కాపురం: మండలంలోని వేములకోటలో గతేడాది జూలై 1వ తేదీన సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వేములకోటలో భార్య రేళ్ల సునీత, అత్త కన్నెసాని నారాయణమ్మను నిందితుడైన రేళ్ల శ్రీను కత్తితో పొడిచి హత్య చేశాడు. అప్పటి నుంచి శ్రీను సెల్‌ఫోన్ వాడకుండా తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు నిందితుడి కదలికలు, బంధువులపై నిఘా పెట్టడంతో రైల్వేస్టేషన్ సమీపంలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వెలుగొండను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు
పశ్చిమ ప్రాంతాలకు సంజీవిని లాంటి వెలుగొండ ప్రాజెక్టుకు అరకొర నిధులను కేటాయించడం కూటమి ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనం. బడ్జెట్లో కేవలం రూ.359 కోట్లు మాత్రమే కేటాయించడం, ఆర్‌ఆర్ ప్యాకేజీకి రూ.116 కోట్లు మాత్రమే కేటాయించడం పశ్చిమ ప్రకాశం ప్రజలను దగా చేయడమే. మార్కాపురంను జిల్లా చేస్తామని చెప్పి ఇప్పుడు మాట దాట వేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలంటే చంద్రబాబు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల తెలియజేస్తూ యర్రగొండపాలెం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తాం.
– తాటిపర్తి చంద్రశేఖర్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కరువు నేల సస్యశ్యామలమవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం వచ్చిన చంద్రబాబు నేనైతే వెలుగొండ ప్రాజక్టును చిటికెలో పూర్తి చేసి చూపిస్తానంటూ గొప్పలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలుగొండను పూర్తి చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలతో కలిసి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. అయితే అందుకు భిన్నంగా కేటాయింపులు జరిగాయి. ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు కేటాయింపులు ఏమూలకు సరిపోవని నీటిపారుదల నిపుణులు అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తేనే కానీ అనుకున్నట్లు పనులు జరగవు. కనీసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయిస్తే అందులోంచి రూ.1000 కోట్లు నిర్వాసితులకు, మరో రూ.1000 కోట్లు ప్రాజెక్టు పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని అధికారులు వాపోతున్నారు. బడ్జెట్‌లో కేటాయించిన రూ.359 కోట్లలో నిర్వాసితులకు రూ. 116 కోట్లుగా చెబుతున్నారు. మిగిలిన రూ.243 కోట్లు దేనికి సరిపోతాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై పశ్చిమ ప్రకాశం జిల్లా రైతులు పెట్టుకున్న ఆశలపై నీరు చల్లినట్టయిందని, మాయమాటలు చెప్పిన చంద్రబాబు మరోసారి నిట్టనిలువునా మోసం చేశారని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
తల్లికి వందనంలో కోతలు తప్పవా...
అమ్మ ఒడి పథకాన్ని పేరుమార్చిన ప్రభుత్వం విద్యార్థుల తలిదండ్రులను ఏమార్చేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కొక్కరికి .. నీకు రూ.15 వేలు...నీకు రూ.15 వేలు అంటూ ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు 2025–26 బడ్జెట్లో నామమాత్రపు నిధులను కేటాయించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. 2019 నుంచి క్రమం తప్పకుండా నాలుగు విడతలుగా సుమారు రూ.1358 కోట్లు తల్లుల ఖాతాలో జమచేసింది. కరోనా సమయంలో కూడా విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చి తన మాట నిలుపుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ 9 నెలలు గడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని కుంటి సాకులు చెబుతూ ఒక ఏడాది తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేసింది. ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి కేటాయించిన నిధులను గమనిస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కోత పెట్టేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
జిల్లా అభివృద్ధి పట్టని టీడీపీ ఎమ్మెల్యేలు...
రాష్ట్రంలో ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంగా పేరొందింది. జిల్లా అభివృద్ధి కోసం కనీసం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించకపోవడంలో ఎమ్మెల్యేలు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని జిల్లా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రంలో 4 పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం దొనకొండ గురించి ప్రస్తావించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇది ఎంత వరకూ కార్యరూపం దాల్చుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సూపర్ సిక్స్‌లోని మహిళలకు ఉచితబస్సు అటకెక్కింది. దీంతో జిల్లాలోని సుమారు 12 లక్షల మంది మహిళలను ప్రభుత్వం మరోసారి మోసం చేసిందనే చెప్పాలి. అన్నదాత సుఖీభవకు కేటాయింపులు పరిశీలిస్తే గత ప్రభుత్వం కంటే లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2.96 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇవ్వగా రానున్న రోజుల్లో ఈ సంఖ్యలో భారీగా కోతపడుతుందన్న అనుమానాన్ని రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
మిగిలిన ప్రాజెక్టుల సంగతేంటి
వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులను కేటాయిండం దారుణం. ఎంతో ప్రతిష్టాత్మమైన వెలుగొండ ప్రాజెక్టునే పట్టించుకోని ప్రభుత్వం ఇక జిల్లాలోని సంగమేశ్వరం, పాలేటిపల్లి ప్రాజెక్టులను పట్టించుకుంటుందనుకోవడం అత్యాశే. జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొని రావడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారు.
– ఎస్‌కె మాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
అరకొర కేటాయింపులు అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేయడం అన్యాయం. కేవలం 10.8 శాతం కేటాయింపులతో ఏమాత్రం విద్యారంగ అభివృద్ధి సాధ్యం కాదు. 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి అన్ని రకాల పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల బకాయిల చెల్లింపులపై 12వ పీఆర్సీ మధ్యంతర భృతి, సీపీఎస్ ఉద్యోగులకు డీఏల 90 శాతం చెల్లింపులు, మ్యాచింగ్ గ్రాంట్‌జమ, పీఎఫ్, ఏపీ జీఎల్‌ఐ పార్ట్ ఫైనల్స్, ఎన్‌కాష్మెంట్ ఆఫ్ ఎర్న్‌లీవ్స్ మంజూరులను బడ్జెట్‌లో ఏ మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు నిరాశ ఎదురైంది.
– బి.అశోక్ కుమార్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
దగా చేసిన కూటమి ప్రభుత్వం
రాష్ట్ర బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.359 కోట్లు కేటాయించడం జిల్లా ప్రజలను మోసగించడమే. దీనిని బట్టి చూస్తే వెలుగొండ పూర్తి చేసే విషయంలో సర్కారుకు చిత్తశుద్ధిలేదని తెలిసిపోతుంది. దొనకొండ పారిశ్రామికవాడ గురించి ఆశలు కల్పించడం మినహా మరేమీ కాదు. అంకెల గారడీతో మోసం చేయాలని చేస్తే ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదు. తగిన గుణపాఠం చెబుతారు.
– ఎంఎల్ నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి
న్యూస్‌రీల్
పచ్చ తమ్ముళ్లకు పాకెట్ మనీగా గుండ్లకమ్మ నిధులు...
రాష్ట్ర బడ్జెట్లో గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.15.50 కోట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెతుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ కోసమంటూ రూ.6.50 కోట్లు బినామీ కంట్రాక్టర్ల పేరుతో టీడీపీ నాయకులు దోచుకున్నారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కేటాయించిన నిధులను ప్రాజెక్టు కోసం నయా పైసా కూడా ఖర్చు చేయకుండా సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుండ్లకమ్మకు రూ.9 కోట్లు కేటాయించి ప్రాజక్టు గేట్లన్నిటినీ మరమ్మతులు చేయించింది. అలాగే ఒంగోలుకు మంచినీరు అందించేందుకుగాను అన్నంగికొండపై లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం కేటాయించిన నిధులతో కుడి కాలు, ఎడమ కాలువ పూడిక పనులు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ పనులను ఇప్పటికే తెలుగు తమ్ముళ్లకు అప్పగించినట్లు తెలుస్తుంది. అంటే కాలువ పూడిక పనులు, ప్రాజెక్టు నిర్వహణ పేరుతో పచ్చ తమ్ముళ్లకు పాకెట్ మనీ ఇవ్వడమేనని రైతులు ఆరోపిస్తున్నారు.
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment