పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు
ఒంగోలు సిటీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. 386 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు హాజరయ్యారు. ఏపీఓఎస్‌ఎస్ (ఎస్‌ఎస్‌సీ, ఇంటర్)కు సంబంధించి 88 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు హాజరయ్యారు. డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్, జిల్లాలోని ఎంఈవోలు, ఉపవిద్యాశాఖాధికారులు, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం, డీసీఈబీ సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment