తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు తాబేళ్ల పాలిట మృత్యువు పాశాలుగా మారాయి. సోనాబోట్లు తీరానికి దూరంగా 12 నాటికన్ మైళ్లకు అవతల చేపలు వేటాడాలి. అయితే తీరానికి 40 మీటర్ల దూరంలోనే చేపల వేట సాగిస్తున్నాయి. దీంతో గుడ్లు పెట్టడానికి తీరానికి చేరుకునే ప్రయత్నంలో తాబేళ్లు సోనాబోట్ల వలలకు చిక్కి మరణిస్తున్నాయి. ఒక్కసారి సోనాబోట్ల వలలో చిక్కుకుంటే చాలు మృత్యువాత పడినట్లేనని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. కొద్ది నెలలుగా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా తీరంలో వేటాడటంతో అటు మత్స్య సంపద పోవటంతో పాటు తాబేళ్లు కూడా మృత్యువాత పడి కళేబరాలు తీరానికి చేరుకుంటున్నాయి. చేపగుడ్లను తినే జెల్లీ ఫిష్‌ను ఇవి ఆహారంగా తీసుకోవటంతో మత్స్యసంపద వృద్ధి చెందుతుంది. అదే విధంగా సముద్రపు నాచును కూడా ఇవి ఆహారంగా తీసుకోవడంతో చేపలు గుడ్లు పెట్టేందుకు అనువుగా ఉంటుంది. తాబేళ్లు అంతరించిపోతే మత్స్యసంపదకే ప్రమాదమని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment