● పేర్నమిట్టలోని సరస్వతి కాలేజీలో విద్యార్థి మాల్ ప్రాక్టీస్
● తొలిరోజు 1408 మంది గైర్హాజరు
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అధికారులు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా నిర్వహించారు. మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ పరీక్షలకు కలిపి మొత్తం 22,690 మందికి గాను 21,282 మంది హాజరయ్యారు. 1408 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షకు 20,564 మంది విద్యార్థులకుగాను 19,461 మంది హాజరవగా, 1103 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకుగాను 2126 మందికి గాను 1821 మంది విద్యార్థులు హాజరవగా 305 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓలు ఏడుగురు, 12 మంది డీఈసీ– డీఐఈఓలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 32 మంది స్క్వాడ్స్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఇంటర్ పరీక్షలను కలెక్టర్ తమీమ్ అన్సారియా సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఒంగోలులోని ఏకేవీకే జూనియర్ కాలేజీ, నారాయణ కాలేజీని ని పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీఓ ఉన్నారు. పేర్నమిట్ట సరస్వతి జూనియర్ కాలేజ్‌లో పరీక్ష రాస్తుండగా ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడని గుర్తించి అతని మీద కేసు బుక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment