యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి

Published Tue, Mar 11 2025 1:18 AM | Last Updated on Tue, Mar 11 2025 1:16 AM

యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి

యువత పోరు ర్యాలీ విజయవంతం చేయండి

ఒంగోలు సిటీ: విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, యువతకు ఉద్యోగ కల్పన లేకుండా మోసగిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 12న చేపట్టిన శ్రీయువత పోరుశ్రీ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత పోరు పోస్టర్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ నెల్లూరు బస్టాండ్‌ దగ్గర నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేకుండా 99 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కింద గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత సంవత్సరానికి కలిపి రూ.7800 కోట్లు బకాయిలు ఉంటే కేవలం రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో కూడా సుమారు రూ.2 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఫీజులు కట్టడం లేదని కొంత మంది యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు డ్రాప్‌అవుట్‌గా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక, ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగభృతి ఒక్కొక్కరికీ రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు కానీ ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రానికి 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారని, అందులో 5 మెడికల్‌ కాలేజీలు పూర్తి చేశారని చెప్పారు. 12 మెడికల్‌ కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా, చంద్రబాబు ఈ రాష్ట్రానికి మెడికల్‌ సీట్లు అవసరం లేదని సెంట్రల్‌ గవర్నమెంట్‌ కు లిఖిత పూర్వకంగా ఇచ్చారన్నారు. మార్కాపురం మెడికల్‌ కాలేజీ 75 శాతం పూర్తయిందన్నారు. మిగిలిన నిధులు విడుదల చేసి పూర్తిచేయాలని, మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రూ.లక్ష కోట్లు అప్పు చేశారని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెంట్రల్‌ గవర్నమెంట్‌ నుంచి డబ్బులను ఎన్నికల ముందు సంక్షేమ పథకాల అమలు కోసం కేటాయిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్ష కోట్లు అప్పులు చేసి కూడా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదన్నారు.

వెలుగొండపై చంద్రబాబు చెప్పేవన్నీ

అసత్యాలే..

వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ అసత్యాలేనని బూచేపల్లి ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోని రెండు టన్నెల్స్‌ పూర్తి చేశారన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి వెలిగొండ ద్వారా నీళ్లిచ్చే వాళ్లమన్నారు. కానీ మార్కాపురం సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం అంతా అబద్ధాల పుట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రూ.600 కోట్లు అని పెట్టారు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, వెలుగొండను నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు కేవలం ప్రాజెక్టుకు శంకుస్థాపన మాత్రమే చేశారని, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి పనులు ప్రారంభించి శరవేగంగా చేశారన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తశుద్ధితో వెలుగొండకు నిధులు కేటాయించి రెండు టెన్నెల్స్‌ పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు తొమ్మిది నెలల కాలంలో ఒక్క సెంటీమీటరు అన్నా పనులు చేశారా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడేందుకే తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని, కానీ కూటమి ప్రభుత్వం జగన్‌కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తాడేమోనని భయంతో ఉన్నారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ పనీ చేయొద్దని చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ వై.ఎం ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కర్నేటి ప్రసాద్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీకాంత్‌, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఒంగోలులో ‘యువత పోరు’ ర్యాలీ రేపు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతిపై మోసగించిన చంద్రబాబు వెలుగొండపై బాబు చెప్పేవన్నీ అసత్యాలే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement