మాదిగలను మరోసారి వంచనకు గురిచేయొద్దు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య
ఒంగోలు టౌన్: జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్లు చెప్పడమంటే మరోసారి మాదిగలను వంచనకు గురి చేయడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు కట్టుబడిన చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నేడు జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేస్తామని చెప్పడం అన్యాయం అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మెప్పు కోసం నేడు జిల్లా యూనిట్ గురించి మాట్లాడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ కోసం గతంలో వేసిన కమిషన్‌లన్నీ జనాభా దామాషా ప్రకారమే చేయాలని నివేదికలు ఇచ్చాయని గుర్తు చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల జనాభా 84,45,400 మంది ఉన్నారని, వారిలో మాలలు 40,43,101 మంది ఉండగా, మాదిగలు 34,68,967 మంది ఉన్నారని, ఉప కులాలు 9,33,332 మంది ఉన్నారని వివరించారు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాలలకు 7 శాతం, మాదిగలకు 6 శాతం, ఉప కులాలకు 2 శాతం వర్తిస్తుందన్నారు. విభజిత ఏపీలో మాదిగల కంటే మాలలు ఎక్కువగా ఉన్నందున వారికి దక్కాల్సిన వాటా దక్కడం ధర్మమేనని చెప్పారు. అలాగే మాదిగలకు కూడా న్యాయబద్ధంగా వాటా అందించాలని డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తే మాల మాదిగలతో పాటుగా సంచార జాతులకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు ఆలూరి చిరంజీవి, రేణమాల మాధవ, గౌడిపేరు కృష్ణ, జి.మహేష్, ముట్లూరి మోజేష్, ఏ.ప్రకాశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment