కోర్టు క్యాలెండరు ఆవిష్కరణ
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబులు కోర్టు క్యాలెండరును సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు నియోజకవర్గ సమాచారహక్కు వింగ్ అధ్యక్షుడు కె.శేషాద్రిరెడ్డి, ఇతర లీగల్ సెల్ సభ్యులు కాటుకూరి బాబురావు, కాటుకూరి సంపత్, ఎస్.పి.జయచంద్రనాయక్, గాయం సావిత్రి, నీలం పద్మలత, తోట రాగసుధారాణి, నాగమల్లేశ్వరరెడ్డి, గంగవరపు ప్రవీణ్‌కుమార్, కె.స్వామిరెడ్డి, తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment