కన్నీళ్లు పెట్టిస్తూ..!
కోతలు కోస్తూ..
గతం.. ఘనం
వ్యవసాయానికి పగటి పూటే నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అభివృద్ధి పనులకు నాంది పలికింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. అప్పటికి ఉన్న ఫీడర్ల సామర్థ్యం సరిపోదని భావించి, ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.850 కోట్ల వ్యయంతో 35 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి నాంది పలికింది. సబ్ స్టేషన్లు, ట్రానన్స్ ఫార్మర్లు, వ్యవసాయ ఫీడర్లను సిద్ధం చేసింది. నూతనంగా 1750 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసింది. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా వ్యవసాయానికి అందజేసింది. విద్యుత్ ఉపకేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్మాణాలు పూర్తయి, సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది.
కళ్ల ఎదుటే రెక్కల కష్టం చెదిరిపోతుంటే .. కరెంటు రూపంలో పంటలు ఎండుతుంటే..అన్నదాత గుండె మండుతోంది. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాపై మాట తప్పిన కూటమి సర్కార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా కోతలు విధిస్తూ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఏడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. అది కూడా వేళాపాళా లేకుండా ఇష్టారాజ్యంగా కరెంటు ఇస్తుండడంతో రైతుల బాధలు
వర్ణనాతీతం. ఒకవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు.. మరో వైపు విద్యుత్ కోతలు వారిపాలిట శాపంగా మారాయి.
కన్నీళ్లు పెట్టిస్తూ..!
కన్నీళ్లు పెట్టిస్తూ..!
Comments
Please login to add a commentAdd a comment