
పుచ్చలమిట్టలో చోరీ
దర్శి(కురిచేడు): స్థానిక పుచ్చలమిట్టలోని త్రిపురాభట్ల పున్నయ్యశాస్త్రి ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..పుచ్చలమిట్టకు చెందిన పున్నయ్యశాస్త్రి కుటుంబసభ్యులు వేసవి కాలం కావడంతో వరండాలో నిద్రిస్తున్నారు. బెడ్‌రూంకు, వరండాలకు వేర్వేరు దారులు ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచి చూసేసరికి బెడ్‌పై దుస్తులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువా తాళాలు తీసి ఉండటంతో పరిశీలించగా..అందులోని 13 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు గుర్తించారు. అయితే ఈ ఇంట్లో చోరీ తరువాత దుండగలు మరో ఇంట్లో చోరీకి తాళాలు పగులగొడుతుండగా చుట్టుపక్కల వారు నిద్ర లేవడంతో దొంగలు పరారయ్యారు.

పుచ్చలమిట్టలో చోరీ
Comments
Please login to add a commentAdd a comment