
వితంతు పింఛన్ కోసం పది నెలలుగా పడిగాపులు
● సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త పోస్టు వైరల్
కంభం: ‘నా భర్త చనిపోయి ఏడాది కావస్తుంది. వితంతు పింఛన్ కోసం పది నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరు కాలేదు. మేం తొలి నుంచి టీడీపీ కార్యకర్తలం’ అంటూ స్థానిక కందులాపురం పంచాయతీలో హైవేరోడ్డుపై చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్న షేక్ కరీమున్నిసాపై సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. అయితే ఆ పోస్టు గమనించిన టీడీపీ మండల అధ్యక్షుడు ప్రస్తుతం ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి లేదని, అందుబాటులోకి వెంటనే పింఛన్ మంజూరవుతుందంటూ మరో పోస్టు సోషల్ మీడియాపై పెట్టారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా పింఛన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి వెబ్‌సైట్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురాలేదని, దీంతో ఎంతో మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment