మద్దిపాడు: రోడ్డు ప్రమాదంలో శనివారం గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన తాటి అజయకుమార్, అతని తల్లి పుష్పావతి ద్విచక్ర వాహనంపై అద్దంకి వెళ్తుండగా జాతీయ రహదారిపై మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు సమీపంలో మార్కెట్ యార్డ్ వద్ద వెనుక నుంచి ఇసుజు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన తాటి పుష్పావతి ఒంగోలులో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు మద్దిపాడు పోలీసులు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment