
50 ఏళ్ల తరువాత అ‘పూర్వ’ కలయిక
మార్కాపురం: సుమారు 50 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు పట్టణంలోని ఎస్‌వీకేపి కళాశాల వేదికగా మారింది. 1972–75 ఏళ్ల మధ్య ఎస్‌వీకెపి కళాశాలలో బీకాం డిగ్రీ చదివిన విద్యార్థులు 50 ఏళ్ల తరువాత ఆదివారం కలిశారు. జీవితంలో స్థిరపడి ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు పలకరించుకుని ఆప్యాయంగా యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాడు కళాశాలలో చేసిన అల్లరిని, గోలను గుర్తుచేసుకుని నువ్విలా చేశావంటే... నువ్వలా చేశావంటూ.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శించుకుని మనవళ్లూ.. మనవరాళ్ల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి నాటి విద్యార్థి, నేటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సాయిబాబా మందిరం వ్యవస్థాపక కార్యదర్శి గోపాలుని హరిహరరావు అధ్యక్షత వహించి పాత స్నేహితులందరినీ కలిపారు. అప్పటి గురువులైన ఊటుకూరి బాలరత్నం శెట్టి, దేవతి రాములను ఘనంగా సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన ఐఎన్‌జీ వైశ్యాబ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఆర్ నారాయణశెట్టి, ప్రముఖ ఆడిటర్ జంకె కృష్ణారెడ్డి, కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ ప్రకాష్‌రావు, సర్వేశ్వర భట్టు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment