ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలను అధికారులు మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల 14వ తేదీన ఒంగోలు నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన లిస్టుల ఆధారంగానే ఎంపికలు జరిగినట్టు తెలిసింది. అలాగే నోటిఫికేషన్ ఇవ్వకుండానే కొన్ని కేంద్రాల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు సమాచారం. దర్శి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులు భారీగా డిమాండ్ చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment