
కూటమి ఫలహారం
పోస్టుల బేరం
అంగన్‌వాడీ పోస్టులు అంగట్లో సరుకుల్లా మారాయి. అధికార కూటమి నాయకులు పోస్టుకో రేటు కట్టి బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెంటర్‌ను బట్టి వసూలు చేసి అమ్ముకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి బంధువులు, పీఏలదే ఇందులో కీలక పాత్ర. వీరు ఓకే చెబితే అధికారులు ఆమోదముద్ర వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనిలోపనిగా అధికారులూ తమ చేతివాటం చూపిస్తూ జేబులు నింపుకుంటున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒంగోలు సిటీ:
జిల్లాలో 38 మండలాల్లో 13 ఎస్‌సీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 2,903 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అంగన్‌వాడీలు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు సంబంధించి ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 109 అంగన్‌వాడీ పోస్టులకు 283, వర్కర్ పోస్టులు 16కుగాను 74, 89 అంగన్‌వాడీ హెల్పర్ల పోస్టులకు గాను 200 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నాలుగు మినీ అంగన్‌వాడీ పోస్టులకు సంబంధించి తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఇంత వరకూ ప్రక్రియ సజావుగా సాగింది. అధికార కూటమి నాయకులు రంగప్రవేశం చేశారు. పోస్టును బట్టి బేరాలు మొదలెట్టేశారు. అంతా బహిరంగంగా జరుగుతూనే ఉన్నా ఉన్నతాధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు.
ఒక్కో పోస్టుకు మూడు లక్షల పైగా వసూలు..
ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ణయించారన్న ఆరోపణలు ఉన్నాయి. సెంటర్‌ను బట్టి ఒక్కో పోస్టుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. హెల్పర్లకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు మరో రేటు నిర్ణయించారు. ప్రధానంగా ఒంగోలు, మార్కాపురంలలో ముందుగా డబ్బులు చెల్లించిన వారికి సదరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి లెటర్‌తో పాటు, పీఏ, వారి బంధువులు అధికారులకు ఫోన్ చేసి పలానా వారికి కన్ఫర్మ్ చేయండి అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా ఒక తంతు అయితే జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలోని సిబ్బంది కూడా మా సంగతి ఏమిటని అడుగుతున్నట్టు సమాచారం. వీరు కూడా పోస్టును బట్టి రూ.50 వేలు నుంచి రూ.లక్షన్నర వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంగట్లో అంగన్‌వాడీ పోస్టులు అమ్ముకుంటున్న కూటమి నాయకులు పోస్టుకు రూ.3 లక్షల పైగా వసూలు చేస్తున్న వైనం అధికారులు కూడా రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే ిపీఏ, బంధువుల కాల్‌తో కన్ఫర్మ్ చేస్తున్న అధికారులు లబోదిబోమంటున్న అర్హులు
Comments
Please login to add a commentAdd a comment