
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
ఒంగోలు టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన 67 కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం ఆయన ఒంగోలు నగరంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రశ్న పత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చేయడానికి తగిన ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కనీస వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులను సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, వన్‌టౌన్ సీఐ నాగరాజు, తాలుకా ఎస్సై సందీప్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment