
హరహరా.. మార్కండేశ్వరా..
● శివనామ స్మరణతో మారుమోగిన మార్కాపురం
● వైభవంగా శివపార్వతుల రథోత్సవం
మార్కాపురం టౌన్: పట్టణంలోని మార్కండేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శివపార్వతుల రథోత్సవం భక్తుల శివనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని నాలుగు మాఢ వీదుల్లో ఊరేగించారు. రాత్రి 7.30 గంటలకు శివపార్వతుల ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్టించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈఓ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు తేజ శర్మ, ఆంజనేయశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల జయజయ ధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. చిన్నారులు, మహిళల కోలాట ప్రదర్శన భక్తులను అలరించింది. స్వామివారిని వివిధ పార్టీల నాయకులు, అధికారులు, పుర ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సైదుబాబు, రూరల్ ఎస్సై అంకమరావు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

హరహరా.. మార్కండేశ్వరా..

హరహరా.. మార్కండేశ్వరా..
Comments
Please login to add a commentAdd a comment