కొనకనమిట్ల: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. గత కొద్ది కాలంగా అతను మతి చలించి ప్రవర్తిస్తున్న తీరు, అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్న వైనాన్ని కొందరు బాలికలు బాలల భక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతికి పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం. జిల్లా పర్యటనలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మంగళవారం కొనకనమిట్ల మండలంలోని ఓ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణలో లోపాలను గుర్తించి సక్రమంగా నడుచుకోవాలని, గడువు ముగిసిన వస్తువులను వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రవర్తిస్తున్న తీరును బాలికల ద్వారా తెలుసుకుని నిశ్చేష్టురాలయ్యారు. మండల స్థాయి అధికారులను పాఠశాలకు పిలిపించి, బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాలలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలపై లైంగిక వేధింపుల విషయం తాను వచ్చే వరకు బయటపడలేదంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యురాలి వెంట తహసీల్దార్ సురేష్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్‌కుమార్, ఎంపీడీఓ డి.ఈశ్వరమ్మ, డీవైఈఓ శామ్యూల్ జాన్, ఎంఈఓ డాంగే షరీఫ్, బి.నర్సింహారావు, సీహెచ్‌ఓ ఎస్‌కే మస్తానమ్మ, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంఎస్‌కే సుధారాణి, బాలల సంరక్షణ అధికారులు ఉన్నారు.
ఉపాధ్యాయుడి తీరుపై
బాలల హక్కుల కమిషన్
సభ్యురాలికి బాలికల ఫిర్యాదు
విచారణ చేపట్టాలని పోలీసులకు
ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment