మద్దిపాడు: మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార్లపాడు గ్రామానికి చెందిన జానపాటి మనీషా కు నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామానికి చెందిన జానపాటి ప్రసాద్ తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. మనీషా కు తన భర్తతో కొంతకాలం నుంచి వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో ఆమె పిల్లలను తీసుకొని గార్లపాడు లో పుట్టింటికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మనీషా తన పిల్లలను తల్లి దగ్గర వదిలిపెట్టి ఎటో వెళ్లిపోయిందని భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ బీ శివరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీఎం జిల్లా కేంద్రానికి సరెండర్
పెద్దదోర్నాల: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన పెద్దదోర్నాల వెలుగు ఏపీఎంను జిల్లా కేంద్రానికి సరెండర్ చేసినట్లు యర్రగొండపాలెం ఏరియా కో ఆర్డినేటర్ డి.దానం తెలిపారు. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సదరు మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించిన విషయం పాఠకులకు విదితమే. ఏపీఎం సరెండర్‌కు సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కేంద్రం నుంచి వెలువడినట్లు దానం తెలిపారు. యర్రగొండపాలెం క్లస్టరుకు చెందిన మూల వెంకయ్య ఇన్‌చార్జి ఏపీఎంగా నియమించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment